Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కేంద్ర ఉద్యోగులకు డీఏ 3 శాతం పెంపు

ఈ ఏడాది జనవరి నుంచే అమలు
కేంద్ర కేబినెట్‌ నిర్ణయం

న్యూదిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందింది. కరవు భత్యం (డీఏ) ను 3 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు ఇచ్చే డీఏ, పెన్షనర్లకు ఇచ్చే డీఆర్‌ (కరవు ఉపశమనం) ను 3 శాతం పెంచింది. దీంతో ఉద్యోగులకు ఇచ్చే డీఏ 31 శాతం నుంచి 34 శాతానికి చేరింది. తాజా నిర్ణయంతో 1.16 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనున్నది. ఈ పెంపు జనవరి 1, 2022 నుంచి అమలవుతుందని కేబినెట్‌ సమావేశం అనంతరం విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఈ పెంపు 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా ఆమోదించిన సూత్రానికి అనుగుణంగా ఉంటుంది’ అని వెల్లడిరచింది. ధరల పెరుగుదల నేపథ్యంలో మూల వేతనం, పెన్షన్‌కు అదనంగా 3 శాతం డీఏ పెంపును వేతన సంఘం సిఫార్సు చేసింది. డీఏ, డీఆర్‌ రెండిరటి పెంపు కారణంగా కేంద్ర ప్రభుత్వ ఖజానాపై సంవత్సరానికి రూ.9,544.50 కోట్ల మేర ప్రభావం చూపుతుంది. దాదాపు 47.68 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందని ప్రకటన తెలిపింది. కాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఎ పెంచడం ఆరు నెలల్లో ఇది రెండవసారి. అంతకుముందు, గత ఏడాది అక్టోబర్‌లో దీపావళికి డీఏను 3 శాతం పెంచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img