Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

రానున్న ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ ఒంటరిగా పోటీ చేయాలి

సవాల్‌ విసిరిన మంత్రి బాలినేని
ఏపీలో రెండేళ్లకు ముందుగానే ఎన్నికల హీట్‌ మొదలైంది. వైసీపీ నేతలు, జనసేన పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. . తాజాగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలపై ఏపీ విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. ‘పవన్‌ కళ్యాణ్‌ ఓ వైపు వైసిపి వ్యతిరేక ఓట్లు చీల్చే ప్రసక్తి లేదంటాడు.. ఎవరి పల్లకీ మోసేది లేదంటాడు.. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే క్లారిటీ లేదు.’ అని మంత్రి బాలినేని అన్నారు. అసలు దమ్ముంటే పవన్‌ కళ్యాణ్‌ రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. అంతేకాదు ఈ సందర్భంగా మంత్రి వర్గ విస్తరణపై సీఎం జగన్‌ నిర్ణయమే ఫైనల్‌ అని చెప్పారు. ఈనెల 11న మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img