Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ప్రభుత్వం ఆస్పత్రుల్లోనూ బూస్టర్‌ డోస్‌కు అనుమతించండి..

కేంద్రానికి హరీశ్‌రావు విజ్ఞప్తి
ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ బూస్టర్‌డోసుకు అనుమతివ్వాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.రెండు డోసులు పూర్తి చేసుకుని, అర్హులైన వారికి ప్రభుత్వం ఆధ్వర్యంలో బూస్టర్‌ డోసు ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సూఖ్‌ మాండవీయకు హరీశ్‌రావు లేఖ రాశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రస్తుతం 60 ఏండ్లు దాటిన వారికి మాత్రమే ప్రికాషనరీ డోస్‌ ఇచ్చేందుకు కేంద్రం అనుమతించింది. 18 ఏండ్లు పైబడిన వారికి ఏప్రిల్‌ 10 నుంచి ప్రికాషనరీ డోస్‌ ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే కేవలం ప్రైవేటు ఆసుపత్రులకే అనుమతించింది. ఈ క్రమంలో ప్రైవేటుతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ 18-59 ఏండ్ల వయస్సున్న వారికి ప్రికాషనరీ డోస్‌ ఇచ్చేందుకు అనుమతించాలని మంత్రి తన లేఖలో పేర్కొన్నారు. ఆ దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img