Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

తగ్గిన కరోనా కేసులు


దేశంలో కొత్తగా 30,093 కరోనా కేసులు

దేశంలో రోజువారీ కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కన్పిస్తూ ఉన్నాయి. తాజాగా నమోదైన కేసులను పరిశీలిస్తే ఆదివారంతో పోల్చుకుంటే దాదాపు 8 వేల వరకు కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,093 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,11,74,322కు పెరిగింది. ఇందులో 3,03,53,710 మంది డిశ్చార్జి అయ్యారు. గడచిన 24 గంటల్లో కొత్తగా 45,254 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కరోనా బారినపడి 374 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 4,14,482 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,06,130 యాక్టివ్‌ కేసులున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 97.32శాతంగా ఉంది. కాగా దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ దేశంలో 41 కోట్ల మందికిపైగా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన నాటినుంచి మంగళవారం ఉదయం వరకూ దేశవ్యాప్తంగా 41,18,46,401 డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img