Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

కరోనా ఫోర్త్‌వేవ్‌ వచ్చే అవకాశాలు తక్కువే..అయినా అప్రమత్తంగా ఉండాలి

సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావు
కరోనా ఫోర్త్‌వేవ్‌ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కోవిడ్‌ నోడల్‌ కేంద్రమైన సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా మహమ్మారి పీడ పూర్తిగా తొలగిపోలేదని, వచ్చేనెలలో కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుందని చెప్పారు.ప్రస్తుతం ఉన్న డెల్టా, ఒమిక్రాన్‌, ఎక్స్‌ఈలు సబ్‌ వేరియంట్లని, వీటి ప్రభావం తక్కువగా ఉంటుందని, కరోనా కొత్త వేరియంట్లపై మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రూపాంతరం చెందిన కరోనా వైరస్‌ కొత్త వేరియంట్లు ప్రతి ఆరునెలలకు ఒకసారి పుట్టుకొస్తున్నాయని, మూడో వేవ్‌లో నూతన వేరియంట్‌ ఒమిక్రాన్‌ బలహీనపడి పెద్దగా ప్రభావం చూపించలేదన్నారు. రూపాంతరం చెందిన కరోనా వైరస్‌ మే, జూన్‌ నెలల్లో నాలుగో వేవ్‌ రూపంలో కాకున్నా కొంతమేర ప్రభావం చూపించడంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img