Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

దేశ రాజధానిలో తీవ్ర బొగ్గు కొరత..ఆసుపత్రులు,మెట్రోలకు పవర్‌ కట్‌ అవకాశం

హెచ్చరించిన దిల్లీ సర్కారు
దేశవ్యాప్తంగా తీవ్ర బొగ్గు కొరత ఏర్పడిరది. దేశ రాజధాని దిల్లీలో బొగ్గు కొరత సమస్య నానాటికీ తీవ్రంగా మారుతోంది. దీనివల్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుందని, మెట్రోలు, ఆసుపత్రులకు కూడా విద్యుత్తు సరఫరాలో సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు దిల్లీి ప్రభుత్వం వెల్లడిరచింది. దాద్రి-2, ఉంచాహర్‌ విద్యుత్తు కేంద్రాల నుంచి విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతోందని, దిల్లీి మెట్రోతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులు, ఇతర కీలక కార్యాలయాలకు 24 గంటల విద్యుత్తును సరఫరా చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొన్నది. అయితే దిల్లీికి విద్యుత్తును అందించే పవర్‌ ప్లాంట్లకు బొగ్గు కొరత ఏర్పడిరదని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆ ప్లాంట్లకు బొగ్గు సరఫరా చేయాలని దిల్లీి మంత్రి సత్యేంద్ర జైన్‌ తెలిపారు. బొగ్గు ఆధారిత పవర్‌ స్టేషన్ల నుంచే దిల్లీకి దాదాపు 30 శాతం విద్యుత్తు అందుతున్నట్లు మంత్రి చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img