Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

అర్దనగ్నంగా నిరసన

? అక్రమ అరెస్ట్ లను ఖండిస్తూ తిరుపతి లో గాంది విగ్రహం వద్ద సిపిఐ నాయకులు మోకాళ్ళ మీద అర్దనగ్నంగా నిరసన.

?అధిక ధరలను అరికట్టలేని జగన్ మోహన్ రెడ్డికి ప్రజా ఉద్యమాలు అంటే ఎందుకు భయం.

?రాష్ట్రంలో ప్రజాస్వామ్యని కాపాడండి .

?సిపిఐ నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్

తిరుపతి : అధిక ధరలను అరికట్టే లేని జగన్మోహన్ రెడ్డికి ప్రజా ఉద్యమాలు అంటే బయం ఎందుకని సీపీఐ నగర కార్యదర్శి విశ్వనాథ్ ప్రశ్నించారు. చలో సచివాలయం కార్యక్రమానికి సిపిఐ పిలుపు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల ముందు నుండే అరెస్టు చేయడం, గృహనిర్బంధం చేయడం సిగ్గు చేటు అని అన్నారు. సీపీఐ నేతల అక్రమ అరెస్టులను ఖండిస్తూ సోమవారం ఉదయం గాంధీ విగ్రహం ఎదుట అర్థనగ్నంగా మోకాళ్ళ పై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పాతర వేయబడుతుంది విమర్శించారు. ముఖ్యమంత్రికి చేతనైతే పెట్రోల్ ,డీజిల్, గ్యాస్ ధరలను అదుపు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్నారు. ఈ ధరలు పెరగడం తో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడు జీవనం సాగించే పరిస్థితి లేదన్నారు. వైసిపి ప్రభుత్వం అరెస్ట్ లతో ఉద్యమాలను ఆపలేరని అన్నారు. అధిక ధరలను అదుపు చేసే వరకు ఉద్యమాలు కొనసాగిస్తమని హెచ్చరించారు.

సీపీఐ సీనియర్ నాయకులు కుమార్ రెడ్డి నగర కార్యవర్గ సభ్యులు రాధ కృష్ణ, బండి చలపతి, ఎండి రవి, శివ,, శ్రీ రాములు, రామచంద్రయ్య ,గోవిందుస్వామి ,సి హెచ్ శివ,యూనియన్ నాయకులూ ,శివ, ఏపి బాల, ఎల్క్ నాయుడు, బాబు ,చంద్ర శేఖర్ నాయుడు, ఆటో యూనియన్ సురేశ్, కుమార్, మహేంద్ర ,శ్రీను,సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

అక్రమ అరెస్ట్ లను ఖండిస్తూ తిరుపతి లో గాంది విగ్రహం వద్ద
సిపిఐ నాయకులు మోకాళ్ళ మీద అర్దనగ్నంగా నిరసన.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img