Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజూడో కరాటే ఖురాష్ లో జివిఇ జెడ్పి జిహెచ్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

జూడో కరాటే ఖురాష్ లో జివిఇ జెడ్పి జిహెచ్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

- Advertisement -

విశాలాంధ్ర -ధర్మవరం : జూడో కరాటే ఖురాష్ లో పట్టణానికి చెందిన జీవీఈ జడ్పీ హైస్కూల్ విద్యార్థినీలు జూడో కరాటే ఖురాష్ లో ప్రతిభ చాటడం జరిగిందని, ఎస్ జి ఎఫ్ జిల్లా పోటీలకు ఎంపిక కావడం జరిగిందని హెడ్మాస్టర్ సుమన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కురాఫ్ కరాటే ఎస్ జి ఎఫ్ జిల్లా పోటీలో దాదాపు నాలుగు వందల మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది అని,ఖురాష్ డిస్టిక్ సెలక్షన్స్ లో 8వ తరగతి చదువుతున్నటువంటి జివిఇ జెడ్పి జిహెచ్ స్కూల్ విద్యార్థినీలు వి. సింధు పాల్గొని, మైనస్ 32 కేజీ విభాగంలో మొదటి స్థానం సాధించి, స్టేట్ మీట్ కు సెలెక్ట్ అవడం జరిగింది అని తెలిపారు. ఈ విద్యార్థులు నవంబర్ 7వ,8 వతేదీలలో అనంతపూర్ డి ఎస్ ఏ లో జరగబోయే స్టేట్ కురాష్ పోటీలకు ఎంపిక కావడం చాలా సంతోషకరమైన విషయమని తెలిపారు. అలానే 9 వ తరగతి చదువుతున్న పి.అఖిల రెండవ స్థానం, అలానే 9 వ జి.సుస్మిత రెండవ స్థానం, 8 వ తరగతి చదువుతున్న బి. ప్రణవి రెండవ స్థానం, 9వతరగతి చదువుతున్న బి.ప్రణీత రెండోవ స్థానం ,9వ తరగతి చదువుతున్న డి.తన్మై రెండవ స్థానం సాధించడం జరిగిందన్నారు. జిల్లా నుంచి నుంచి రాష్ట్రస్థాయికి ఎంపికైన అయినటువంటి విద్యార్థులను హెడ్మాస్టర్ సుమనతోపాటు పాఠశాల విద్యా కమిటీ, పి ఈ టి లు స్వరూప, సరళ, పాఠశాల ఉపాధ్యాయ, బోధనేతర సిబ్బంది అభినందన శుభాకాంక్షలు తెలిపారు. అలానే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా హెడ్మాస్టర్ అభినందించారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ జూడో కోచ్లు ఇనాయత్ భాష, నవ్య శ్రీ ప్రత్యేకంగా అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు