Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

వడ్డీరేట్లలో పెంపుపై ఊహాగానాలు

న్యూదిల్లీ: దేశంలో ద్రవ్యోల్బణం భరించేస్థాయికంటే ఎక్కువగా ఉండటంతో, దాన్ని అదుపు చేసేందుకు వడ్డీ రేట్లను మరోమారు పెంచే అవకాశాలున్నాయన్న అంచనాల నడుమ భారత రిజర్వు బ్యాంక్‌ (ఆర్బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల సమీక్ష సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. చర్చల అనంతరం బుధవారం ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఎంపీసీ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. రెపో రేటులో మరో పెంపు ఉండవచ్చని దాస్‌ ఇప్పటికే సూచించారు. అయితే అది ఎంతమేర ఉండవచ్చనేది ఆయన వెల్లడిరచలేదు. ద్రవ్యోల్బణ పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు కనిపించనందున వచ్చే నాలుగు విధాన సమీక్షల్లో కలిపి 1 శాతం వరకూ వడ్డీ రేట్లు పెంచేందుకు ఆర్బీఐ సిద్ధమవుతోందని కొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ నివేదిక ప్రకారం చూస్తే.. ప్రస్తుత సమీక్షలో రెపోను ఆర్‌బీఐ 40 బేసిస్‌ పాయింట్ల మేరకు పెంచే వీలుంది. ఆగస్టులో అదనంగా మరో 35 బేసిస్‌ పాయింట్ల వరకూ సవరించవచ్చు. రెపో రేటు పెరిగినప్పుడు దానికి అనుసంధానమైన రెపో ఆధారిత గృహరుణ వడ్డీ రేట్లలోనూ పెంపు కనిపిస్తుంది. కాబట్టి, ఇప్పటికే రుణం తీసుకున్న వారు, కొత్తగా తీసుకోబోయే వారికీ భారం తప్పకపోవచ్చు. ప్రస్తుత సమీక్షలో రిజర్వు బ్యాంకు కనీసం 35 బేసిస్‌ పాయింట్ల పెంపునకు వెళ్లవచ్చని ఊహాగానాలు ఉన్నాయి. అయితే వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం… వరుసగా ఏడవ నెల కూడా దూసుకుపోయి, 8 ఏళ్ల గరిష్ఠ స్థాయి (ఏప్రిల్‌లో 7.79శాతం)కి చేరుకున్నందున వడ్డీ రేటులో భారీ పెంపుదల ఉంటుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఇంధనం, ఇతర నిత్యావసరాల ధరలు పెరుగుదలతో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలను మరింతగా పెంచింది. ఇక టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 13 నెలలుగా రెండంకెల స్థాయిలోనే కొనసాగి ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో 15.08 శాతానికి చేరుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img