Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు..

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపడం తో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. అందులో ఒకరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం గాయపడిన విద్యార్థులను సికింద్రాబాద్‌ రైల్వే హాస్పటల్‌ కు తరలించారు. దాదాపు నగలు గంటలుగా రైల్వే స్టేషన్‌ లో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. పదుల సంఖ్యలో రైలు బోగీలు అగ్నికి ఆహుతియ్యాయి. స్టేషన్లో ఉన్న అన్ని స్టాల్ల్స్‌ , ఫుడ్‌ కోర్ట్‌ లు ధ్వసం అయ్యాయి. అగ్నిపథ్‌ నిర్ణయం ఉప సంహరించుకోవాలని నినాదాలు చేస్తూ కనిపించేదల్లా కాల్చేస్తున్నారు. మరోపక్క వీరిని అదుపు చేయలేక పోలీసులు కాల్పులు మొదలుపెట్టారు. ప్రస్తుతం స్టేషన్‌ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ రక్తసిక్తంగా మారింది. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లురువ్వుతున్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఘటనకు ఎన్‌ఎస్‌యూఐకి ఎలాంటి సంబంధం లేదని ఎన్‌ఎస్‌యూఐ నేత బల్మూరి వెంకట్‌ తెలిపారు. ఎన్‌ఎస్‌యూఐ చేస్తుందని మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు. మూడు ప్లాట్‌ఫామ్‌లలో నిరసనకారులు బీభత్సం సృష్టించారు. 20 బైక్‌లకు నిప్పు పెట్టారు. రైళ్లకు నిప్పు పెట్టటంతో పాటుగా లగేజీ రాక్‌ లు..అదే విధంగా.. అక్కడ ఉన్న క్యాంటీన్లు.. స్టాళ్లను పూర్తిగా ధ్వంసం చేసారు. రైళ్ల పైకి రాళ్లు విసరడటంతో పలువురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. ఈ సమయంలో వివిధ ప్రాంతాల నుంచి రావాల్సిన.. వెళ్లాల్సిన పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఎక్కడికి అక్కడే నిలిపివేసారు. పలు రైళ్లను రద్దు చేసారు. పెద్ద సంఖ్యలో నిరసన కారులు రైళ్ల ముందు నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతో..పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ప్రయాణీకులు భయంతో స్టేషన్‌ నుంచి బయటకు వెళ్లారు. స్టేషన్‌ బయట బస్సులను ధ్వంసం చేసారు. మంటలను అదుపు చేయటానికి పెద్ద సంఖ్యలో ఫైర్‌ సిబ్బంది స్టేషన్‌ కు చేరుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img