Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

శాశ్వత మంచినీటి పథకం ప్రారంభించిన పేలప్రోలు చారిటబుల్‌ ట్రస్ట్‌

విశాలాంధ్ర బ్యూరో`ఒంగోలు : పేలప్రోలు చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆర్థిక సహకారంతో ఒంగోలు సెయింట్‌ తెరెసా హైస్కూల్‌ ఆవరణ నందు విద్యార్థులకు శాశ్వత మంచినీటి పథకాన్ని శుక్రవారం పేలపోలు చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ రామకృష్ణ పరమహంస (బిర్లా) ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయులు బొంతు ఆనందరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మారెళ్ళ వివేకానంద పాల్గొని మాట్లాడుతూ పేలప్రోలు చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నగరంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారన్నారు. ఈ స్కూలుకి వాటర్‌ ట్యాంక్‌ ఏర్పాటు చేసి విద్యార్థులకు దాహం తీర్చడం ఎంతో ఆనందదాయకమైన చర్యని చెప్పారు. ఈ ట్రస్ట్‌ ద్వారా భవిష్యత్తులో పేద విద్యార్థులకు చదువుల నిమిత్తం ఆర్థిక సాయం అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిటిజన్‌ ఫోరం అధ్యక్షులు కొల్లా మధు,పూర్వ విద్యార్థుల సంఘం ఉపాధ్యక్షులు మారెళ్ళ సుబ్బారావు, ట్రస్ట్‌ సెక్రెటరీ మంచినేని శ్రీనివాసరావు, మారెళ్ళ అశోక్‌ స్టోర్‌ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img