Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

మరో కొత్త మహమ్మారి ‘మార్‌ బర్గ్‌’ వైరస్‌..

ఆఫ్రికాలో వ్యాపిస్తున్న ప్రాణాంతక వ్యాధి
ఎబోలా తరహాలో అత్యంత ప్రమాదకరమని ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
సోకిన వారిలో 24 శాతం నుంచి 88 శాతం వరకు మరణించే శాతం ఉంటుందని వెల్లడి

ప్రపంచవ్యాప్తంగా ఓ వైపు కరోనా వైరస్‌ పంజా విసురుతూనే ఉంది. ఇలాంటి సమయంలో మరో వైరస్‌ మహమ్మారి కేసులు బయటపడటం ఆందోళనకరంగా మారుతోంది. పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా దేశంలో ప్రమాదకరమైన ‘మార్‌ బర్గ్‌’ వైరస్‌ కేసులు వెలుగుచూశాయి. ఘనాలోని దక్షిణ అశాంటి రీజియన్‌లో ఇద్దరు వ్యక్తులకు ‘మార్‌ బర్గ్‌’ వైరస్‌ సోకినట్టుగా ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. వారితో సన్నిహితంగా మెలిగిన 98 మందిని క్వారంటైన్‌లో పెట్టినట్టుగా తెలిపింది. గబ్బిలాలు, అడవి జంతువులకు దూరంగా ఉండాలని.. మాంసం ఉత్పత్తులను బాగా శుభ్రం చేసి, ఉడికించిన తర్వాతే తీసుకోవాలని ఘనా ఆరోగ్య శాఖ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img