Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఇటలీలో కార్మిక చట్టాల అమలుకు పోరు

రోమ్‌: కార్మిక చట్టాలను అమలు చేయాలని ఇటలీలో ట్రేడ్‌ యూనియన్‌లు చేపట్టిన చర్యలను నేరంగా పరిగణించే ప్రభుత్వ ప్రయత్నాలను ఆల్‌-వర్కర్స్‌ మిలిటెంట్‌ ఫ్రంట్‌ (పీఏఎమ్‌ఈ) తీవ్రంగా ఖండిరచింది. ఇటలీలో కార్మికుల సమస్యలపై సంఘటితంగా ఉద్యమిస్తున్న యూఎస్‌బీ, సి కొబాస్‌ యూనియన్‌్‌లపై ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ వారిపై వివిధ నేరారోపణలను మోపడాన్ని తీవ్రంగా గర్హించాయి. దీనిలో ఉన్న యూనియన్‌లు, ట్రేడ్‌ యూనియన్‌లు లాజిస్టిక్స్‌ రంగంలో కార్మికులు చేపట్టిన పికెటింగ్‌లు, సమ్మెలు, నిరసనలు, సమీకరణల వంటి అంశాలపై వివిధ నేరారోపణలను ఎదుర్కొంటున్నాయి. ఈ నేరారోపణ ఆధారంగా పోలీసులు ట్రేడ్‌ యూనియన్‌ల నాయకులను వారి ఇళ్లలో ఆపరేషన్‌ చేపట్టి 4 యుఎస్‌బి ట్రేడ్‌ యూనియన్‌ నాయకులను అరెస్టు చేశారు. యూరప్‌ అంతటా కార్మికులు తమ వేతనాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేపట్టారు. ఈ నేపధ్యంలో వేతనాల పెంపుదలను డిమాండ్‌ చేస్తున్న కార్మికులపై యజమానులు, ప్రభుత్వాలు సంఘటితం కాకుండా నిరోధించడానికి కుట్రలు పన్నుతున్నాయి. సామ్రాజ్యవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కార్మికుల హక్కులను కాపాడుతున్న ట్రేడ్‌ యూనియన్‌ల చర్యలను నేరంగా పరిగణించి విచారణ చేయడం ఇప్పుడు గ్రీస్‌, యూరప్‌ అంతటా పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ఇటలీ ప్రభుత్వ యంత్రాంగం లక్ష్యంగా హింసకు గురవుతున్న ఇటాలియన్‌ ట్రేడ్‌ యూనియన్‌లు యూఎస్‌బీ, సి కోబాస్‌ ఇటలీలోని కార్మికులందరికీ తమ సంఫీుభావాన్ని ప్రకటించాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img