Monday, May 6, 2024
Monday, May 6, 2024

అరుంధతి వాడలో ఘోర అగ్ని ప్రమాదం

రెండు పూరిల్లు దగ్ధం
రోడ్డున పడ్డ వృద్ధులు

చిట్టమూరు:(విశాలాంధ్ర)మండల పరిధిలోని దిగువ దరఖాస్తు అరుంధతి వాడలో కరెంట్ షాట్ సర్క్యూట్ వలన మంటలు రేగి రెండు పూరిళ్లు అగ్నికి ఆహుతి అవడంతో ఆ కుటుంబీకులు కట్టుబట్టలతో రోడ్డున పడినట్లు బాధితులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గురువారం ఉదయం ఎలాంటి పనులు లేక ఇల్లు వద్ద ఉన్న సమయంలో మంద ఈశ్వరమ్మ, మందా సుబ్బమ్మల పురిల్లు కప్పు నుండి మంటలు వ్యాపించడంతో భయాందోళనకు గురైన కుటుంబీకులు బయటకు పరుగులు తీశారు అసలే వేసవి కాలం కావడంతో చుట్టుపక్కల ఎక్కడా నీరు లేకపోవడం వలన మంటలు అదుపు చేయలేక పోయారు గ్రామస్తులు మంటలలో కాలిపోతున్న పూరిళ్లును చూసి ఇంకా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని భావించి స్థానికులు కోట అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసే సమయానికి పక్కపక్కనే ఉన్న రెండు పూరిళ్లు మందా ఈశ్వరమ్మ,మందా సుబ్బమ్మ ఇల్లు పూర్తిగా కాలిపోయాయి ఇళ్లలోని బట్టలు, బంగారు వస్తువులు ఆహార వస్తు సామగ్రి ఒక కుటుంబంలో పదివేల రూపాయలు నగదు మరో కుటుంబంలో 20వేల రూపాయలు నగదు అంతా అగ్నికి ఆహుతైపోయి కట్టుబట్టలతో మిగిలామని కూలి నాలి చేసుకుని జీవించే మాకు దిక్కు ఎవరని ప్రభుత్వాధికారులకు తమకు సహాయం చేసి ఆదుకోవాలని ప్రభుత్వం పక్కా గృహాలు మంజూరు చేయించి వాళ్లకి ఇచ్చి ఆ వృద్ధులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

అగ్నిమాపక అధికారి వివరణ:అగ్నిమాపక అధికారి బిసి అంకయ్యను వివరణ కోరగా గురువారం ఉదయం 10 గంటల సమయంలో దిగువ దరఖాస్తు అరుంధతి వాడలో షార్ట్ సర్క్యూట్ వలన మంటలు రేగి ఇల్లు కాలిపోతున్నాయని శరవాణి ద్వారా సమాచారం ఇవ్వడంతో తమ సిబ్బందితో కలసి తక్షణం దిగువ దరఖాస్తు అరుంధతి వాడకి వెళ్లి మంటలు అదుపు చేయడం జరిగిందని ఆ సమయానికి అదుపు చేయలేకపోతే పెద్ద ప్రమాదమే స్తంభవించుండేదని మంటలు అదుపు చేయడం వలన ఆ ప్రమాదం నుంచి బయటపడినట్టు ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img