Monday, May 6, 2024
Monday, May 6, 2024

ఉభయసభలు వాయిదా

‘పెగాసస్‌’ స్పైవేర్‌ అంశం పార్లమెంటు ఉభయసభలను మంగళవారం కూడా కుదిపేసింది. సభా కార్యక్రమాలు ప్రారంభం కాగానే ఈ వ్యవహారంపై తక్షణం చర్చ జరపాలంటూ విపక్ష ఎంపీలు పట్టుబట్టారు. లోక్‌సభ, రాజ్యసభలో విపక్షాలు నిరసన నినాదాలతో హోరెత్తించారు. దీంతో ఉభయసభలూ కొద్దిసేపు వాయిదా పడ్డాయి.లోక్‌సభ ప్రారంభం కాగానేఎంపీలు రైతుల ఆందోళన, పెగాసస్‌ ప్రాజెక్ట్‌, తదితర అంశాలపై చర్చించాలంటూ నినాదాలు చేశారు. నినాదాలు తీవ్ర స్థాయికి చేరడంతో స్పీకర్‌ ఓం బిర్లా సభను వాయిదా వేశారు.ఇక రాజ్యసభలో విపక్ష సభ్యులు వెల్‌లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. పెగాసస్‌ ప్రాజెక్టు నివేదికపై చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. విపక్ష సభ్యులు పట్టువీడకపోవడంతో సభను ఆయన 12 గంటల వరకు వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img