Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఏమి దొరా నీవల్ల ఉపయోగం

కేసీఆర్‌కు వైఎస్‌ షర్మిల చురకలు
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై వైయస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్‌ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల కాలంలో వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కేసీఆర్‌ సర్కార్‌ విఫలమైందని వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ట్విట్టర్‌ వేదికగా కేసీఆర్‌ పై మండిపడిన వైయస్‌ షర్మిల భారీ వర్షాలకు పంట దెబ్బతినడంతో మనస్తాపానికి గురైన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించిన పేపర్‌ క్లిప్పింగ్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి సీఎం కేసీఆర్‌కు ప్రశ్నాస్త్రాలు సంధించారు. కేసీఆర్‌ రౖౖెతులను ఆదుకోవడంలో ఎందుకు విఫలమవుతున్నారు అని ప్రశ్నించిన వైయస్‌ షర్మిల మునిగిపోయే కాళేశ్వరానికి లక్షల కోట్లు అప్పు తెచ్చిపెట్టొచ్చు కానీ, అన్నం పెట్టే రైతును ఆదుకోవడానికి పైసల్‌ లేవా? అంటూ ఆయనను నిలదీశారు. వానలకు, వరదలకు లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయిన రైతులు..ఆదుకోవాల్సిన సర్కార్‌ ఆసరా లేదనిఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉందని వైయస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ప్రాణాలు తీసుకోకుండా ఏ ఒక్క రైతునైనా ఆదుకొన్నావా కేసీర్‌ అంటూ వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. వరదలకు ఇండ్లు మునిగిపోయి, కట్టుబట్టలతో రోడ్డున పడ్డ బాధితులకు సాయం చేసావా? అంటూ కేసీఆర్‌ పై అసహనం వ్యక్తం చేశారు. వరద బాధితులకు 10వేల రూపాయల సాయమని ప్రకటనలు చేసి వారాలు గడుస్తున్నా ఇప్పటివరకు పైసా అన్న ఇచ్చావా? వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పంటల బీమా చేయడం చేతకాదని మండిపడ్డారు.నష్టపోయిన రైతులను ఆదుకోవడం చేతకాదు, వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకోవడం చేతకాదు అంటూ నిప్పులు చెరిగారు. ఏమిదొరా నీవల్ల ఉపయోగం అని అసహనం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img