Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి

విశాలాంధ్ర – వెంకటగిరి : సోమవారం దళిత డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, డక్కిలి తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా దళిత డప్పు కళాకారుల సంఘం వెంకటగిరి నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు వడ్డిపల్లి చెంగయ్య మాట్లాడుతూ వందల సంవత్సరాల నుండి దళితులు డప్పులు ఇతర వాయిద్యాలు వాయిస్తున్న కూడా ఇంతవరకు వారికి గుర్తింపు కార్డులు కూడా ఇవ్వకపోవడం దురదృష్టకరమని అన్నారు. వెంటనే దళిత డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డప్పులు మరియు ఇతర వాయిద్యాలు, వాయిస్తున్నటువంటి దళితులందరికీ యూనిఫామ్ ఇతర సామాగ్రి వెంటనే వారికి ఇవ్వాలని అన్నారు. 50 సంవత్సరములు పైబడిన వారికి పెన్షన్ ఇవ్వాలని అన్నారు. డప్పు కళాకారులకు ట్రైను మరియు బస్సులలో 50% రాయితీ కల్పించాలని అన్నారు. నిరుపేద డప్పు కళాకారులకు మూడు ఎకరాల భూమిని పంపిణీ చేయాలని అన్నారు. ప్రమాదవశాత్తు మరణించినటువంటి దళితడప్పు కళాకారులకు ఐదు లక్షలు, సాధారణ మరణానికి రెండు లక్షలు చెల్లించాలని అన్నారు. తదితర సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయాలని అన్నారు. లేదంటే దళిత డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాల్ని ఉదృతం చేస్తామని అన్నారు. డిడి కేఎస్ డక్కిలి మండల అధ్యక్షులు తిరుపాలు మండల కార్యదర్శి ఉదయ్ కుమార్ జాషువా, కిరణ్ కుమార్. పెంచలయ్య. రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img