Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

పార్లమెంటు సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టాలి

ఏపీ ఎమ్మార్పీఎస్ డిమాండ్

విశాలాంధ్ర -రాజంపేట: శీతాకాల పార్లమెంటు సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని ఏపీ ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొజ్జ పెంచలయ్య డిమాండ్ చేశారు. బుధవారం ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ తహసిల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బొజ్జ పెంచలయ్య మాట్లాడుతూ శీతాకాల పార్లమెంటు సమావేశాలలో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ ఈనెల 8,9వ తేదీలలో ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్షలు చేపట్టారని.. ఆయన దీక్షకు మద్దతుగా తాము ఈ ర్యాలీ చేపట్టడం జరిగిందని తెలిపారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి వర్గీకరణ అంశాన్ని తేల్చాలని కోరారు. తెల్ల రేషన్ కార్డుదారులకు జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పిఎస్ నాయకులు సూరేపల్లి మురళిధర్, యంబులూరు మణి, నగిరిపాటి బాబు, సిద్ధవటం రామ్మోహన్, సుబ్రహ్మణ్యం, ప్రసాద్, సుబ్బరాయుడు, పెద్దబాబు, తేజ శ్రీను, బద్రి, శివ, రమేష్, రమణ, పునీత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img