Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

పంగులూరు మండలంలో ఘనంగా హర్ ఘర్ తిరంగ వేడుకలు

విశాలాంధ్ర – జె పంగులూరు : మన భారతదేశం స్వాతంత్య్రం పొంది 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా . • హర్ ఘర్ తిరంగా” అనే కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పంగులూరు, చందలూరు లో ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా పంగులూరు ప్రధానోపాధ్యాయిని కొప్పోలు రమాదేవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశ భక్తిని పెంపొందించు కావాలన్నారు. ఈ కార్యక్రమములో యన్.సి.సి. విద్యార్థులు, ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్య క్రమములో ప్రధానో పాధ్యాయిని శ్రీమతి కొప్పోలు రమాదేవి, యన్.సి.సి. ఆఫీసర్ శ్రీమతి దాట్ల శాంతి, వ్యాయామోపాధ్యాయులు శ్రీ చెరుకూరి వాసుబాబు, ఉపాధ్యాయిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో భాగంగా మానవహారం ఏర్పాటు చేశారు. విద్యార్థులచే, దేశభక్తి గీతాలు గ్రామస్థులను అలరించాయి.

పాఠశాలకు బహూకరణ

‘ విద్యార్థులకు చేతివ్రాత బాగుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందనే సత్సంకల్పంతో ” డాక్టర్ చిలుకూరి రాములు ఫౌండేషన్ ఏర్పాటు చేసిన చిలుకూరి శ్రీధర్ గారు 350 మంది విద్యార్థులుకు దాదాపు లక్ష రూపాయల విలుగల తెలుగు మరియు ఇంగ్లీషు కాపీ పుస్తకాలను అందజేశారు. వీరికి పాఠశాల తరపున చిలుకూరి శ్రీథర్ కు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కొప్పోలు రమా దేవి కృతజ్ఞతలు తెలియ జేశారు.
పాఠశాలకు బీరువాల బహు కరణ

జి.ప. ఉన్నత పాఠశాలకు, పంగులూరుకు పూర్వ విద్యార్థి సుంకర సుధాకరరావు. రిటైర్డు ఇంజీనీరు (బి.హెచ్.ఇ.యల్) మరియు చుండూరి శంభయ్య. విశ్రాంత ప్రధానోపాధ్యాయులు దాదాపు 25 వేల రూపాయల విలువైన రెండు బీరువాలు అంద జేశారు. వీరికి పాఠశాల తరపున పాఠశాల ప్రధానోపాధ్యాయిని కొప్పోలు రమాదేవి కృతజ్ఞతలు తెలిపారు
అలాగే చందలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మరియు ఐటిసి ఇండియా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img