Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

సిపిఐ జిల్లా మహాసభలకు సర్వం సిద్ధం

నేటి నుండి సిపిఐ ఏలూరు జిల్లా ప్రధమ మహాసభలు
సిపిఐ శ్రేణులు జయప్రదం చేయాలి

ఏలూరు: ఏలూరులో ఈనెల 23 24 తేదీలలో జరుగుతున్న సిపిఐ ఏలూరు జిల్లా ప్రధమ మహాసభలకు సర్వం సిద్ధమైనట్లు సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఏలూరు జిల్లా ప్రథమ మహాసభలు నగరంలో జరుగుతున్నాయని సిపిఐ శ్రేణులు నాయకులు, భారీగా తరలివచ్చి మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మహాసభల సందర్భంగా నగరంలో సిపిఐ జండాలు, తోరణాలు, ఫ్లెక్సీలు, గోడ పత్రికలు తదితర రూపాలలో సిపిఐ ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ నేతృత్వంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు. 23వ తేదీ మంగళవారం మధ్యాహ్నం గం.2లకు శ్రీ కాశీ విశ్వేశ్వర కళ్యాణమండపం నుండి ప్రదర్శన ప్రారంభమై పవర్ పేట రైల్వే స్టేషన్, ఆర్ఆర్ పేట, ప్రభుత్వ ఆసుపత్రి, ఫైర్ స్టేషన్, ఫ్లై ఓవర్ బ్రిడ్జి మీదుగా జూట్ మిల్, పాత బస్టాండ్ సెంటర్ నుంచి మున్సిపల్ కార్యాలయం కు చేరుకుంటుందన్నారు. అనంతరం గం.4 లకు బహిరంగ సభ జరుగుతుందన్నారు. ప్రదర్శన ముందు భాగంలో గిరిజన యువతి యువకులతో కోలాటం, డప్పు కళాకారుల డప్పుల మోత తదితర విన్యాసాలు ఉంటాయన్నారు. 24వ తేదీ ఉదయం శ్రీకాశీ విశ్వేశ్వర కళ్యాణ మండపం వద్దా పతావిష్కరణ అనంతరం ప్రతినిధుల మహాసభ ఈ మహాసభలలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేసు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని వెంకట రామారావులు పాల్గొంటారని తెలిపారు. జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపై చర్చించి పరిష్కారం కోసం భవిష్యత్తు ప్రణాళిక రచించి ఈ మహాసభలలోరూపకల్పన చేస్తామని తెలిపారు.

ఉద్యమాలకు ప్రణాళిక…

జిల్లాలో ప్రధానంగా తెలుగు ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, 960 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు, ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు కోసం, ముంపు ప్రాంతాల ప్రజలకు పునరావాస కాలనీల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన,అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు భూములకు పట్టాలు పంపిణీ కొరకు ఉద్యమాలకు వ్యూహరచన చేస్తామన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి, ఆ ప్రాంతంలో ఉన్న నాణ్యమైన బొగ్గు వెలికి తీయడం, వన సంరక్షణ సమితులకు భూమిపై హక్కు, టిడ్కో ఇల్లు లబ్ధిదారులకు అందజేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ప్రణాళిక రూపొందిస్తామన్నారు. జిల్లాలో అటవీ బంజరు భూమి, మిగులు భూములు పేదలకు దక్కించడం కోసం సిపిఐ భవిష్యత్తులో చేసే పోరాటాలకు పథక రచన చేస్తామన్నారు. జిల్లాలో రైతాంగ, వ్యవసాయ కార్మికులు, బలహీన వర్గాలు, మహిళల, కార్మికుల సమస్యలపై చ ర్చించి దిశా నిర్దేశం చేస్తామన్నారు. మహాసభలు విజయవంతం చేయడానికి సిపిఐ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img