Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

ముద్దరబోయిన తీరుపై తెలుగు తమ్ముళ్ళ ఆగ్రహం

కోవర్టులకు పదవులు ఎలా ఇచ్చారు

చాట్రాయి: టిడిపి సమన్వయ కమిటీ సమావేశంలో నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ముద్దరభోయిన వెంకటేశ్వరరావు పార్టీలో కొందరినేతలను కోవర్టులు అనడం అగ్నికి ఆజ్యం పోసినట్లయిందని పలువురు అంటున్నారు. స్థానిక టిడిపి కార్యాలయంలో తన అనుచరులతో నియోజకవర్గ ఇన్చార్జి ముద్రబోయిన సమావేశం నిర్వహించారు. తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారన్న కొంతమంది ముఖ్య నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేదానిలోభాగంగా చాట్రాయి మండలంలో గత నాలుగైదు నెలల క్రితం వరకు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కి దిక్సూచిలా పనిచేసిన ముఖ్య నాయకులను ఏకపక్షంగా పార్టీ నుంచి బహిష్కరించే దానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వ్యూహాత్మకంగా కోవర్టులు అనే పదప్రయోగం చేసినట్లు తెలుస్తోంది. ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కి చంద్రబాబు నూజివీడు అసెంబ్లీ స్తానాన్ని కేటాయించిన దగ్గర నుంచి ప్రధానంగా ఎక్కువమంది నాయకత్వం ముద్దరబోయిన వెంటే నిలిచారు. మాగంటిబాబు ముద్రబోయిన వర్గపోరు లో కూడా కమ్మ సామాజిక తరగతికి చెందిన ముఖ్య నాయకులు ముద్దరభోయిన కే మద్దతుగా నిలిచారు.ముద్దరబోయినకు సీట్ కేటాయించాలంటూ రాష్ట్ర కార్యాలయంలో హడావుడి చేశారు. టిడిపి మండల అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు ఉన్న కాలంలో ఆయన వ్యతిరేకులు పోటీగా కార్యక్రమాల కమిటీ అద్యక్షపదవిని తెరపైకి తెస్తే దానికి కూడా ముద్దరభోయిన బలమైన ప్రోత్సాహం ఇచ్చారని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చలు సాగిన విషయం తెలిసిందే.చనుబండలో టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షుడుని ఎన్నుకోవడానికి జరిగిన బలప్రదర్శనలో పార్టీ బలంతో సంబందంలేకుండా ముద్దరభోయిన ఆరోజు ఎవరిగ్రూపుని బలపరిచారని,పోలీసులు టిడిపి అంతర్గత వ్యవహరంలో ఆరోజు గొడవలు జరగకుండా కాపలా కాసింది నిజం కదా అని అనుచరులు అంటున్నారు. కోవర్టులు అనేది ఎవరిని…కేవలం నాలుగు నెలలు క్రితం వరకూ నచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎలా కోవర్టులు అయ్యారు.బొట్టు వరలక్ష్మి కి ఇచ్చిన మండలపార్టీ అధ్యక్ష పదవి మార్పులో చాట్రయి మం లోని 18 గ్రామాల పార్టీ కార్యకర్తలతో చర్చించి మార్చారా,ముద్దరభోయిన వేంకటేశ్వర రావుకి దానిలో ప్రదాన పాత్ర కాదా…లేదా అని చర్చించుకుంటున్నారు.కోవర్టులే అయితే ఒక్కోక్కరికి నాలుగు పార్టీ పదవులు ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. ముద్దరబోయినను బలపరిస్తే తప్పుకాదనేది ప్రదానంగా చర్చనీయాంశంగా మారింది. జనార్దనవరం ఆరుగొలనుపేట గ్రామలలో పర్వతనేని గంగాదర్ పర్యటనలో టిడిపికి చెందిన బలహీన వర్గాల కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడంతోనే కోవర్టులు అనే పదాన్ని తెరపైకి తెచ్చారని అంటున్నారు. తన వెనుక వున్నవారు ఎదురుతిరిగే పరిస్థితిని సృష్టించిన వ్యక్తే ముద్దరభోయిన అని పెద్ద ఎత్తున వద్దంతులు వినవస్తున్నాయి. చాట్రాయి మండలంలోని వైసిపి ముఖ్య నాయకుడికి పరామర్శలు చేసిన ముద్దరబోయిన కోవర్టుగానే చేసారాఅంటున్నారు.నియోజకవర్గ వర్గం లోనే అతి పెద్ద నాయకుడైన మాజీ ఎఎంసి చైర్మన్ కాపా శ్రీనివాస్ రావు పై సోషల్ మీడియా అసభ్యంగా పోస్ట్ లు పెట్టె వారిని ఏమాత్రం నిలవరించే ప్ర యత్నం చేయని ముద్దరభోయిన మమ్మల్ని సంవత్సరాల తరబడి వాడుకుని నేడు కనీస గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు.చాట్రాయి మం ముఖ్య నాయకులు తమపై ముద్దరభోయిన కక్షసాధింపులు చేస్తున్నారని జిల్లా అధ్యక్షులు గన్నివీరాంజనేయులు దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img