Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ప్రజాస్వామిక హక్కులను కాపాడండి

ఎస్ సి, ఎస్ టి, బిసి సామాజిక చైతన్య వేదిక

చాట్రాయి: ప్రజాస్వామిక హక్కులను కాపాడాలని, పోలీస్ వేధింపులను నిలిపివేయాలని ఎస్ సి, ఎస్ సి, బిసి సామాజిక చైతన్య వేదిక నాయకులు వి.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం స్పందన కార్యక్రమంలో తహశీల్దార్ విశ్వనాథరావుకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోజురోజుకు ప్రజాస్వామిక హక్కులను హరించివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పాదయాత్రలో ఎన్నికల ప్రచారంలో జగన్ ఉద్వోగులకు ఇచ్చిన హామీలు తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమం చేస్తామంటే సమస్యను పరిష్కరించకుండా, ప్రశ్నించిన వారిని వేధించడం అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. మిలీనియం మార్చ్ కి ఆటోలు ఎక్కించుకోవద్దంటూ బెదిరించి నోటీసులు జారీ చేయడం దారుణమైన విషయం అన్నారు. ఇటీవల జరిగిన విద్యార్థుల పోరాటాన్ని కూడా అణిచివేయడానికి పోలీసు శాఖను ప్రయోగించి అధికార దుర్వినియోగం చేశారని విమర్శించారు. సంక్రాంతి పండుగకి సాంప్రదాయం పేరుతో జూద క్రీడలకు అనుమతి ఇచ్చే ప్రభుత్వం హక్కుల కోసం పోరాడే వారిపైన అణిచివేత నిర్బంధాన్ని కొనసాగించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కొనసాగుతోందా లేదా పోలీస్ పాలనా, పోలీస్ రాజ్యం నడుస్తోందా అని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధంగా ఉన్న ప్రాథమిక హక్కులను కాపాడాలని తాము కోరుతున్నామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img