Monday, May 6, 2024
Monday, May 6, 2024

ఆర్ బి కెల అనుసంధానంతో ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరించాలి

జిల్లా వ్యవసాయాధికారి రాబర్ట్ పాల్

విశాలాంధ్ర,పార్వతీపురం: రైతు భరోసా కేంద్రాల అనుసందానంతో ప్రకృతివ్యవసాయాన్ని మరింత విస్తరించాలని జిల్లావ్యవసాయ అధికారి రాబర్ట్ పాల్ తెలిపారు.శుక్రవారం జిల్లాప్రకృతి వ్యవసాయకార్యాలయంలో 
ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్  షణ్ముుకరాజు ,అదనపు ప్రాజెక్ట్ మేనేజర్ ధనుంజయరావుల అధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయసమీక్ష కార్యక్రమంను నిర్వహించారు.ఈకార్యక్రమంలో జిల్లా వ్యవసాయఅధికారి రాబర్ట్ పాల్ , ప్రకృతి వ్యవసాయ రీజనల్ టెక్నికల్ ఆఫీసర్ హేమసుందర్లు ముఖ్యఅతిథులుగా 
పాల్గొని ప్రకృతివ్యవసాయ సిబ్బంది లక్ష్యాలు, విజయాలు గూర్చి సమీక్ష చేశారు.నెలవారీ ప్లానింగ్ తెలుసుకున్నారు. రైతు భరోసా కేంద్రాల సిబ్బంది మరియు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అనుసంధానంతో పనిచేసి ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరించాలని, రైతులదరూ పూర్తిస్థాయిలో ప్రకృతివ్యవసాయ విధానాన్ని అవలంబించేలా తగుచర్యలు తీసుకోవాలని తెలిపారు.రాష్ట్రంలోనే పార్వతీపురం మన్యంజిల్లాను ప్రకృతి వ్యవసాయ సాగులో అగ్రగామిగా నిలపాలని కోరారు. ప్రకృతి వ్యవసాయం విస్తరణలో సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వాటిని వెంటనే పరిష్కరించే ప్రయత్నం చేస్తామని వారు తెలియజేసారు.రీజనల్ టెక్నికల్ ఆఫీసర్ హేమసుందర్  మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది గ్రామస్థాయి నుండి మరియు మండల స్థాయి వరకు జరుగుతున్న వ్యవసాయ సలహామండలి సమావేశాలకు హాజరై  ప్రకృతి వ్యవసాయ ప్రగతిని వారికి తెలియజేసి ప్రకృతి వ్యవసాయం ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో సమిష్టిగా కృషి చేయాలని చెప్పారు. డిపిఎం షణ్ముఖరాజు  మాట్లాడుతూ రైతులను ప్రకృతి వ్యవసాయ రైతులుగా మార్చాలని, రైతులకు ఉన్నవిస్తీర్ణం అంతా ప్రకృతి వ్యవసాయ సాగు చేసేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు.అదనపు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ధనుంజయ  మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులతోనూ కిచెన్ గార్డెన్ వేయించాలని,వారియొక్క సొంత అవసరాలకు సరిపడే కూరగాయలు వారే ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించుకునే విధంగా ప్రోత్సహించాలని తెలియజేశారు. గుమ్మలక్ష్మీపురం వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న షణ్ముఖరాజు డిపిఎంగా భాధ్యతలు స్వీక రించిన సందర్భంగా ఆయనను అభినందించారు. అదేవిధంగా ఇటీవల జిల్లా ఉత్తమ అధికారిగా జిల్లా కలెక్టర్ నుండి ప్రశంసా పత్రాన్ని పొందిన జిల్లా వ్యవసాయ అధికారి రాబర్ట్ పాల్ కు కూడా అభినందనలు చెప్పారు. ఈకార్యక్రమంలో జట్టు ప్రతినిధి నూకంనాయుడు,స్టేట్ ఎన్ ఎఫ్ ఏ గణేష్, జిల్లాప్రకృతివ్యవసాయసిబ్బంది మంతిని
మానస, దేవీప్రసాద్, విజయ ప్రశాంతి, రామగోవింద, వివిధమండలాల ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img