Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

చదువు మూడో నేత్రం

ఎఎంసిమాజీ చైర్మన్ దేశి రెడ్డి

చాట్రాయి: చదువంటే మూడో నేత్రం అని ప్రతి విద్యార్థి బాల్యంలో క్రమశిక్షణతో చదువుకోవడం ద్వారా పేదరికాన్ని పారద్రోల వచ్చని ఏఎంసీ మాజీ చైర్మన్ దేశి రెడ్డి రాఘవ రెడ్డి విద్యార్థులకు తెలిపారు. చాట్రాయి మండలంలో నాలుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్ టిసి బస్సుపై స్కూల్ కు వెళ్లే 800 విద్యార్థులకు ఆయన సొంత నిధుల నుండి రూ.50 వేలను నూజివీడు ఆర్టీసీ డిపోకు చెల్లించి విద్యార్థులకు పాస్ లను అందజేశారు. సోమవారం సాయంత్రం చిన్నంపేట జడ్పీ స్కూల్ ఆవరణంలో పాస్ లు పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలమాన పరిస్థితుల్లో చదువు మూడో నేత్రంలా మారిందన్నారు. ఎంత నిరుపేద కుటుంబంలో పుట్టిన కష్టపడి చదువుకుంటే అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తున్నారని, పెద్ద ఎత్తున సిరిసంపదలతో తులతూగుతున్నరని గుర్తు చేశారు. బాగా కష్టపడి చదువుకుని ఉన్నత స్థానాలలో నిలబడితే మీస్కూలుకి, తల్లిదండ్రులకు ,మన ఊరికి, మండలానికి మంచి గుర్తింపు వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బక్కయ్య, చిన్నంపేట పిఎసిఎస్ చైర్ పర్సన్ పరసా చెన్నారావు, పాఠశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు చింత ఏసుబాబు, నూజివీడు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img