Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

సిపిఐ ఆధ్వర్యంలో ఇంజనీర్ కార్యాలయం ముందు ఆందోళన

సూళ్లూరుపేట : వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లను బిగించడాన్ని వ్యతిరేకిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో సూళ్లూరుపేట విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిషనల్ ఇంజనీర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించి అనంతరం విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి సి సుధాకర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు అనుసంధానించి ఇప్పటికే సంక్షోభంలో మునిగిపోయి ఉన్న దేశ రైతాంగాన్ని మరింత ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి నశించాలని రైతాంగ నడ్డి విరిచే వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లను బిగించకుండా పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కనీసం మద్దతు ధరకు కూడా పండించిన పంటను కొనుగోలు చేయలేని ప్రభుత్వాలు రైతాంగాన్ని ఇబ్బందులు పాలు చేసేలా సంస్కరణలు తీసుకువస్తున్న ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో ఇటువంటి రైతు వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో రైతాంగ ఉద్యమానికి, రైతు పోరాటానికి పాలకులు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మోదుగుల పార్థసారథి,ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి ఇలప నాగేంద్రబాబు మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు డి చెంచమ్మ , ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి తేరే సూర్య, లక్ష్మి, బాలు, బాలయ్య, వెంకటేష్ నాయర్, ప్రభుదాస్, వసుంధర, విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img