Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

మహా పాదయాత్రకు బ్రహ్మరథం పట్టిన గ్రామ ప్రజలు

. అడుగడుగునా నీరాజనం పలికిన రైతులు
. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉండాలి,
. రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలి

విశాలాంధ్ర – తాడేపల్లి : అమరావతినే రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగించాలని సోమవారం (12వతేదీన) “వెంకటపాలెం నుండి అరసవెల్లి” వరకు సుమారు వెయ్యి కిలోమీటర్లమేర, 60 రోజుల పాటు జరుగనున్న”మహా పాదయాత్ర సోమవారం ప్రారంభమైంది.మహా పాదయాత్ర కు సంఘీభావంగా సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర సహాయకార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, గుంటూరు నగర కార్యదర్శి కోట మల్యాద్రి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పచ్చల శివాజీ, బందెల నాసర్ జీ, షేక్ వలి, బి.వి.చంద్ర శేఖర్ రావు, మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య,మండల కార్యదర్శి జాలాది జాన్ బాబు,రైతుసంఘం జిల్లా అధ్యక్షులు కొల్లి రంగారెడ్డి, తాడికొండ నియోజకవర్గ కార్యదర్శి ముప్పాళ్ల శివ శంకర రావు ,సిపిఐ పార్టీ, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని సంఘీభావం తెలిపి పాదయాత్రలో నడిచారు.సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ మాట్లాడుతూ సీఎం అయ్యాక.. జగన్ మారిపోయారుని అన్నారు ఏపీ అమరావతి రైతుల పాదయాత్రకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మద్దతు తెలిపారు. అమరావతే రాజధాని అని జగన్ హామీ ఇచ్చి సీఎం అయ్యారని..సీఎం అయ్యాక జగన్ గుణం మారిపోయిందనినారాయణ ఎద్దేవా చేశారు. ‘పాదయాత్రలు, ర్యాలీలుఅంటే సీఎంకు ఎందుకు కోపం? జగన్ సీఎం పదవినుంచి దిగిపోవాలని రైతులు పాదయాత్ర చేయట్లేదని అమరావతి రాజధాని కావాలనే పాదయాత్రచేస్తున్నారని అన్నారు. మీరు, మీ నాన్న పాదయాత్రలు చేసే సీఎంలు అయ్యారు’ అని నారాయణ చెప్పారు.రాజధాని విషయంలో ప్రభుత్వం మాట మార్చినా ప్రజలు మాత్రం ప్లేటు ఫిరాయించకుండా అమరావతికే కట్టుబడి ఉన్నారని అన్నారు.రాజధాని అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మొదలు పెట్టిన మహాపాదయాత్ర 2.0 కు కృష్ణాయపాలెం గ్రామం లో తెలుగుదేశం పార్టీ నాయకుల ఘన స్వాగతం, పాదయాత్ర కు సంఘీభావం
అమరావతి నుండి అరసవల్లి వరకు జరగనున్న రాజధాని రైతుల మహాపాదయాత్ర కు మంగళగిరి మండలం, కృష్ణాయపాలెం గ్రామంలో ఘన స్వాగతం పలికి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక శాసన సభ్యుడు ఆళ్ళ రామకృష్ణ రెడ్డి, ఎన్నికల ముందు జగన్ రెడ్డి ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు, ఇదే రాజధాని అని, తీరా గెలిచాక మడమ తిప్పారని జగన్ రెడ్డి, నిడమర్రు గ్రామంలో జరిగిన పాదయాత్ర లో ఇదే రాజధాని అని, మేము అధికారం లోకి వచ్చిన వెంటనే ఇంకా మెరుగైన రాజధాని నిర్మిస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి ఈ ప్రాంత ప్రజానీకాన్ని మోసం చేశారని అధికార మదం తలకెక్కిన ఆళ్ళ రామకృష్ణ రెడ్డి, రాజధానికి భూములిచ్చిన రైతులను రియల్ ఎస్టేట్ బ్రోకర్ల ని అవహేళన చేసాడని అన్నారు.ఈ ప్రాంత ఓట్ల తో గెలిచి, మూడు రాజధానులకు మద్దత్తు పలికి,తనకు ఓట్లేసిన ప్రజలకు నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి ఆర్కే
అమరావతి ఏకైక రాజధానిగా,రైతుల పాదయాత్ర కు ఒక్క వైస్సార్సీపీ తప్ప అన్ని పార్టీ లు మద్దత్తు పలికాయి అమరావతి రైతుల ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా భరిస్తూ, రైతులు ముందుకు సాగుతున్నారని.అన్నారు.రైతుల మహాపాదయాత్ర విజయవంతం కావాల మూడు రాజధానులంటూ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న జగన్ రెడ్డి, ఈ మూడున్నర సంవత్సరాలు నుండి చేసిన అభివృద్ధి జీరో మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్ ఇకనైనా కళ్లు తెరచి, అమరావతి ని ఏకైక రాజధాని గా ప్రకటించాలని అమరావతి రైతుల మహాపాదయాత్రలకు స్వాగతం పలికి సంఘీభావం తెలిపిన వారిలో మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ వ్యవహారాల సమన్వయ కర్త నందం అబద్దయ్య, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకిదేవి, గుంటూరు పార్లమెంట్ టిడిపి ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు,రాష్ట్ర తెలుగుమహిళ ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య,రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటరావు,రాష్ట్ర టీడీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు,రాష్ట్ర టీడీపీ మైనారిటీ సెల్ కార్యదర్శి అబ్దుల్ మజీద్,రాష్ట్ర తెలుగురైతు కార్యదర్శి గాదె పిచ్చి రెడ్డి,మంగళగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దామర్ల రాజు, మండల పార్టీ అధ్యక్షులు తోట పార్ధసారధి, తాడేపల్లి పట్టణ పార్టీ అధ్యక్షులు వల్లభనేని వెంకటరావు, దుగ్గిరాల మండల పార్టీ అధ్యక్షులు కేసంనేని శ్రీ అనిత, తాడేపల్లి మండల పార్టీ అధ్యక్షులు అమరా సుబ్బారావు, నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు కారంపూడి అంకమ్మరావు, జంగాల సాంబశివరావు,ఇట్టా భాస్కర్,ఎండీ ఇబ్రహీం,మాజేటి గోపాలకృష్ణ శ్రేష్టి, పడవల మహేష్, రాయపూడి కిరణ్,బెజ్జం రామకృష్ణ రావు,రెంటపల్లి రాజేష్, ఈపూరి జయకృష్ణ,దేవరపల్లి మహేష్,బోగి వినోద్, షేక్ సుభాని, వాకా మాధవరావు, గోసాల రాఘవ, బొర్రా కృష్ణవందన, అన్నెం కుసుమ తదితరులు పాల్గొన్నారు.అమరావతి రైతుల పాదయాత్రకు సిపిఎం సంపూర్ణ మద్దతు.అమరావతినే ఎకైక రాజధానిగా కొనసాగించాలని అమరావతి రైతులు సోమవారం నుంచి అమరావతి టు అరసవల్లి వరకు నిర్వహించే పాదయాత్రకు సిపిఎం సంపూర్ణ మద్దతు తెలుగుజేస్తూ పాదయాత్రలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు, సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం. రవి తదితరులు పాల్గొన్నారు.

రైతులు మహా పాదయాత్రకు జనసేన పార్టీ మద్దతు

అమరావతి నుండి అరసవల్లి వరకు చేపట్టిన రైతుల మహాపాదయాత్రలో భాగంగా కృష్ణయ్యపాలెంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు మహా పాదయాత్ర లో పాల్గొని రైతులకు జనసేన పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేశారు.
ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ అమరావతి రైతులకు జనసేన పార్టీ తరఫున మద్దతు ఎల్లప్పుడు ఉంటుందని, దాన్లో భాగంగా ప్రారంభమైన మహా పాదయాత్రకు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రైతుల కోసం సంపూర్ణ మద్దతు తెలిపి పాదయాత్రలో పాల్గొనడం జరిగిందని, విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఉండాలని, అమరావతి అయితే అన్ని విధాలుగా బాగుంటుందని, అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ గారు అమరావతి రాజధాని సంపూర్ణ మద్దతు కూడా తెలిపారు. కానీ నేడు అధికారంలోకి వచ్చిన జగన్ గారు మూడు రాజధానులు అంటూ, అమరావతి రాజధాని అభివృద్ధికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతుల్ని ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని, ఎప్పటికైనా అమరావతే రాజధాని నిర్ణయించి అమరావతి అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు.ఈ మహా పాదయాత్రలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ శేఖర్, జనసేన పార్టీ ఐటీ విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ చవ్వాకుల కోటేష్ బాబు, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు (JSR), గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, మంగళగిరి పట్టణ అధ్యక్షులు షేక్ కైరుల్లా, మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరావు, దుగ్గిరాల మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, దుగ్గిరాల MPTC మరియు దుగ్గిరాల మండలం వైస్ MPP శ్రీమతి పసుపులేటి సాయి చైతన్య, మంగళగిరి మండల ఉపాధ్యక్షులు బత్తినేని అంజయ్య, తాడేపల్లి మండల ప్రధాన కార్యదర్శి తిరుమల శెట్టి శ్రీధర్, మంగళగిరి నియోజకవర్గ యూత్ నాయకులు చిట్టెం అవినాష్, మంగళగిరి పట్టణ జనసేన పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జొన్నాదుల పవన్ కుమార్, మంగళగిరి మండల జనసేన పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ లేళ్ళ సాయి నందన్, చిల్లపల్లి యూత్ అధ్యక్షులు మేకల సాయి, మంగళగిరి మండల కమిటీ సభ్యులు, తాడేపల్లి మండల కమిటీ సభ్యులు, యర్రబాలెం గ్రామ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img