Monday, May 6, 2024
Monday, May 6, 2024

రానున్న మూడు రోజుల్లో ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రానున్న మూడు నాలుగు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కోస్తాంధ్రకు ఆనుకుని పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో క్యుములోనింబస్‌ మేఘాలు ఆవరించి కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.ఇప్పటికే రాయలసీమలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడ్డాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. పిడుగులు పడే ప్రాంతాలను అధికారులు ముందస్తుగా అప్రమత్తం చేస్తున్నారు. అయితే, సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 1వ తేదీ వరకు ఓ మోస్టరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కర్నూలు, నంద్యాల్‌, ఒంగోలు, బాపట్ల, నరసరావుపేట, గుంటూరు, ఏలూరు, అమలాపురం, రాజమండ్రి, కాకినాడ, అనకాపల్లి, పాడేరు, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురంలలో సెప్టెంబర్‌ 27-అక్టోబర్‌ 1 వరకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అనంతపురం, కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, విశాఖపట్నంలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పుట్టపర్తి, రాయచోటి ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img