Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఏపీలో మరో మూడ్రోజులు వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో.. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిరది. అల్పపీడనం రేపు ఏపీ తీరంవైపు ప్రయాణించే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనంతో వానలు పడే అవకాశం ఉంది. రానున్న మూడు రోజులు కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయి. అదేవిధంగా రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడిరచింది. తీరం వెంబడి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img