Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దేశ ప్రగతికి గొడ్డలిపెట్టు


పెదకూరపాడు : దేశాభివృద్ధిలో భాగస్వామ్యమై ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష పైచిలుకు కార్మికులకు జీవనోపాధి కల్పిస్తున్న ఆంధ్రుల హక్కుగా భావించే విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించడం దేశ ప్రజల ప్రగతికి గొడ్డలిపెట్టు అని పెదకూరపాడు నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి మునుగోటి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఢల్లీిలో జరుగుతున్న కార్యక్రమాలలో భాగంగా ప్రాణత్యాగంతో సాధించుకున్న విశాఖ ఉక్కు కాపాడుకోవాలనే ఏకైక లక్ష్యంతో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దీక్ష కార్యక్రమాలలో భాగంగా పెదకూరపాడు మండలం 75 తాళ్లూరు గ్రామంలో సీపీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన దీక్ష కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సోమవారం మాట్లాడుతూ 32 మంది బలిదానంతో 52 మంది కమ్యూనిస్టు శాసనసభ్యుల రాజీనామాలతో ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు ఆనాడు 1952లో కాపాడుకుంటే నేటితరానికి దేశ సంపదను అందించేందుకు విశాఖ ఉక్కును కాపాడేందుకు యావత్‌ ప్రజానీకం ప్రజా ఉద్యమాలలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్‌ నాయకులు నాగమల్లేశ్వరరావు, శ్రీను, సీపీఐ నాయకులు చల్లపల్లి పానయ్య, ఆది, వాసు, ఎస్‌కే సుభాని, బెజం వసంత, దేవసహాయం తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img