Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

ఐదు రెట్లు పెరిగిన విద్వేష ప్రసంగాలు

. సీపీఐ కార్యదర్శి అజీజ్‌ పాషా విమర్శ
. అమలుకాని పునర్విభజన హామీలు: చాడ
. మునుగోడు ప్రజలు బీజేపీ ఆటలు సాగనీయరు: కూనంనేని

విశాలాంధ్ర`హైదరాబాద్‌ : దేశంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చాక 2014 నుంచి 2019 వరకు విద్వేష ప్రసంగాలు 500 శాతం పెరిగినట్లు ఒక మీడియా సంస్థ సర్వేలో తేలిందని సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్‌ అజీజ్‌ పాషా తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే అంతర్జా తీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోం
దన్నారు. మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం దీనిని సరి చేసుకోవాలని, అలా జరిగితేనే మనకు ఐక్య రాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం వచ్చే అవకాశం ఉన్నదని అన్నారు. ఇక్కడి మఖ్దూంభవన్‌లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మోదీ పాలనలో నిరుద్యోగం, ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, శ్రీలంక ను మించిన దుర్భర ఆర్థిక పరిస్థితులు దేశంలో నెలకొని ఉన్నాయన్నారు. మందిర్‌, మసీదు అంటూ విద్వేషాలు రెచ్చగొడుతూ వైఫల్యాలను కప్పి పుచ్చుకుంటున్నారని అజీజ్‌ పాషా విమర్శించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, గడిచిన ఎనిమిదేళ్లలో ఏపీపునర్విభజన హామీలలో ఒక్కటి కూడా మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. ఎన్డీయే పాలనలో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందని, నిరుద్యోగం పెరిగిందని, ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటికి కారణమైన బీజేపీ తెలంగాణలో పాగా వేసేందుకు మునుగోడును ప్రయోగశాలగా చేస్తోందని విమర్శించారు. వామపక్ష , అభ్యుదయ భావాలు కలిగిన మునుగోడు ప్రజలు బీజేపీ ఆటలు సాగనీయరని అన్నారు. కేంద్ర బలగాలను దుర్వినియోగం చేసేందుకు బీజేపీి చేస్తున్న ప్రయత్నాలను ఓటర్లు తిప్పికొడతారని చాడ వెంకటరెడ్డి అన్నారు. దేశానికి ప్రథమ శతృవైన బీజేపీని మునుగోడు ఉప ఎన్నికలో ఓడిరచాలని సీపీిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు.
డబ్బు, అధికారం అడ్డుపెట్టుకొని గెలవచ్చనే ధీమాతో తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా మునుగోడు నియోజకవర్గంలో బీజేపీి ఉప ఎన్నిక తీసుకువచ్చిందని అన్నారు. విలేకరుల సమావేశంలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి, పశ్య పద్మ, ఎన్‌.బాలమల్లేశ్‌, ఈటీనర్సింహా, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాల్మాకుల జంగయ్య పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img