Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

సిహెచ్‌ఐఎమ్‌ఇ సర్వేలో అపోలో హాస్పిటల్స్‌ ముందంజ

హైదరాబాద్‌: భారతదేశంలో హెల్త్‌కేర్‌ రంగంలో మార్గదర్శకులు, మొట్టమొదటి మల్టీ-స్పెషాలిటీ గొలుసుకట్టు హాస్పిటల్స్‌ను కలిగిన అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజ్‌ లిమిటెడ్‌, క్రిటికల్‌ కేర్‌, అంబులేటరీ కేర్‌ (ఔట్‌పేషంట్‌ సేవలు)ల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న ది కాలేజ్‌ ఆఫ్‌ హెల్త్‌కేర్‌ ఇన్ఫర్‌మేషన్‌ మేనేజ్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్స్‌ (%జనIవీజు%) విడుదల చేసిన 2022 డిజిటల్‌ హెల్త్‌ మోస్ట్‌ వైర్డ్‌ సర్వే ఫలితాలలో లెవెల్‌ 9 అచీవ్‌మెంట్‌ను సాధించింది. సిహెచ్‌ఐఎమ్‌ఇ సర్వే చేసిన 38,000 కంటే ఎక్కువ సంస్థలలో, అపోలో హాస్పిటల్స్‌ అనలిటిక్స్‌, డేటా మేనేజ్‌మెంట్‌, పాపులేషన్‌ హెల్త్‌, మౌలిక సదుపాయాలు, పేషెంట్‌ ఎంగేజ్‌మెంట్‌ వంటి విభాగాలలో సహచర సంస్థలతో పోలిస్తే గణనీయంగా ఎక్కువ ర్యాంక్‌ను సాధించింది. ఆరోగ్య సంరక్షణ సంస్థలలో నూతన సాంకేతికతల స్వీకరణ, ఏకీకరణ, అభివృద్ధి అన్ని దశలలో, ప్రారంభ అభివృద్ధి మొదలుకుని పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న వారి వరకు ఈ సర్వే అంచనా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img