Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు

విశాలాంధ్ర, సీతానగరం:మండలంలో ఏకాదశి పర్వదిన సందర్భంగా దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక మాసంలో ఏకాదశి రోజుకు ఎంతో విశిష్టత ఉండగా భక్తులు వేకువజామునుండి నదీ స్నానాలుచేసి దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రోజంతా ఉపవాసం ఉండి రాత్రి పూట మరలా దర్శనం చేసుకొని ఉపవాసం చెల్లిస్తామని పలువురు మహిళా భక్తులు తెలిపారు.మండలంలోని అన్ని గ్రామాల్లో ఆలయాలతో పాటు సీతానగరం మండలం కేంద్రములోని వేణుగోపాలస్వామిఆలయంలో, లక్ష్మి నరసింహస్వామి ఆలయంలో, సువర్ణ ముఖేశ్వరస్వామిఆలయంలో, స్థానిక హనుమాన్ కూడలి వద్ద ఉండే విఘ్నేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి దేవాలయంలోను మరియు లచ్చయ్యపేట ఎన్ సి ఎస్ కర్మాగార ఆవరణలో ఉన్న శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. సీతానగరంలో శివ స్వాములు విభూతి రాసుకుని ప్రదాన వీదుల్లో హర హర మహాదేవ శంభో శంకర అంటూ చేసిన భజనలు, అలంకరణను అందరూ తిలకించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img