Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

వి ఓ ఏ పై దాడికి పాల్పడి వారిని కఠినంగా శిక్షించాలి

వి ఓ ఏ ల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షురాలు ఏ కమల‌

విశాలాంధ్ర-మైలవరం: నియోజకవర్గ పరిధిలోని జి కొండూరు మండలం దుగ్గిరాలపాడు గ్రామానికి చెందిన వివో ఏ ప్రమీలపై అదే గ్రామానికి చెందిన సర్పంచ్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ వేధించటం తగదని మహిళ అని చూడకుండా చేయి చేసుకునే స్థాయికి దిగజారటం దుర్మార్గమైన చర్య అని ఏ కమల అన్నారు. సోమవారం ఉదయం మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వి ఓ ఏ ప్రమీల ను సిఐటియు మండల కార్యదర్శి సిహెచ్ సుధాకర్, యానిమేటర్ల సంగ జిల్లా ఉపాధ్యక్షురాలు ఉమా తో కలసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గతంలో అనేక అవినీతి ఆరోపణలు ప్రమీలపై చేసి ఒత్తిడిలు చేశారని, ఆమె ఎస్సీ కమిషన్ కు వెళ్లి విచారించగా ఇవన్నీ ఆరోపణలు మాత్రమే అని వాస్తవాలు కాదని నిగ్గు తేల్చిన తర్వాత జిల్లా అధికారులు తిరిగి ఆమెని కొనసాగించాలని అధికారికంగా తెలిపిన కానీ స్థానిక ప్రజాప్రతినిధులు ఈ రకమైన రీతిలో దాడులకు ప్రయత్నించటం గర్భవతి అయిన మహిళపై చేయి చేసుకునే స్థాయికి దిగజారటం దురదృష్టకరమని అన్నారు, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సర్పంచ్ పై తగిన చర్యలు తీసుకోవాలని ప్రమీల కు రక్షణ కల్పించాలని తిరిగి విధుల్లోకి ప్రమీల ను యధావిధిగా కొనసాగించాలని ఆమె డిమాండ్ చేశారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రమీలకు మద్దతుగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img