Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

కొండపల్లి ఐడీఏ లో కెమికల్ విధ్వంసం….!!!

. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న రేకుల కంపెనీ యాజమాన్యం…!!
. ప్రాణాంతక విష వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో డంపింగ్ చేస్తున్న వైనం….!!
. చినుకు పడితే సమీప పంట కాలువలో విష వ్యర్ధాలు కలిసిపోయే ప్రమాదం…!!
. రేకుల కంపెనీ యాజమాన్యం వైఖరి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు….!!

విశాలాంధ్ర-మైలవరం( కొండపల్లి) : కొండపల్లి ఐడీఏ లోని రేకుల కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి కారణం గా ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం పొంచి ఉంది.. ప్రాణాంతక విష వ్యర్థాలతో స్థానిక ప్రజలు క్యాన్సర్ బారిన పడే దుస్థితి నెలకొంది.. అత్యంత ప్రమాదకరమైన కెమికల్ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వదులుతున్న కంపెనీ యాజమాన్యం ప్రజల ఆరోగ్యం తో వంచెలగాటం ఆడుతున్నారు.. కొండపల్లి క్వారిలకు వెళ్ళే మార్గం లో ఉన్న చెత్త డంపింగ్ యార్డు లో రేకుల కంపెనీ యాజమాన్యం విష వ్యర్థాలను డంపింగ్ చేస్తున్నారు.. రేకుల తయారీకి వినియోగించే అత్యంత ప్రమాదకరమైన ఫైబర్ వ్యర్ధాలు నిబంధనలకు అనుగుణంగా డంప్ చేయాలి కానీ నిర్వాహకులు జనసంచారం ఉండే అతి సమీపం వేయడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది..రేకుల కంపెనీ వ్యర్థాలతో ఇప్పటికే ఐడీఏ బూడిద మయం కాగా ఇప్పుడు ప్రాణాంతక వ్యర్ధాలు సైతం. చెత్త డంపింగ్ యార్డ్ లో వేయడం స్థానికులకు ఆగ్రహాన్ని కారణం అవుతుంది.. ఒక్క చినుకు వర్షం పడినా వ్యర్ధాలు నీటి రూపం లో సమీప పంట కాలువ లో కలిసే అవకాశం ఉంది అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. పంట కాలువ ల ద్వారా జన వసాల్లోకి వెళితే ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

గతం లో కూడా ఇదే తరహాలో కెమికల్ వ్యర్ధాలు బహిరంగ ప్రదేశాల్లో డంపింగ్ చేస్తే యాజమాన్యం పై పిర్యాదులు వచ్చాయి అని తెలిసింది..అయితే మళ్ళీ ఇప్పుడు అదే తీరును వ్యవహరిస్తున్న కంపెనీ యాజమాన్యం పై ప్రజలు, ప్రజా సంఘాలు ఆందోళనకు దిగేందుకు సిద్దం తప్పదని బాధితులు వాపోతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img