Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

అదనపు తరగతి గదుల నిర్మాణాలకు శంఖు స్థాపన

విశాలాంధ్ర – జగ్గయ్యపేట: స్ధానిక బాయ్స్ హై స్కూల్ నందు నాడు నేడు కార్యక్రమంలో భాగంగా కోటి 32 లక్షల రూపాయలతో 11 అదనపు తరగతి గదుల నిర్మాణనికి రాష్ట్ర ప్రభుత్వవిప్, జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యులు సామినేని ఉదయభాను శంఖు స్థాపన చేసారు.ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశంలోనే ఎక్కడా లేని విధంగా నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రవేట్ స్కూల్స్ కు దీటుగా ప్రభుత్వ స్కూల్స్ ను నిర్మించడం జరుగుతుందని అన్నారు.రాష్ట్రంలో విద్యకు వైద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని,చదువుకునే విద్యార్థులకు అమ్మ ఒడి,విద్యా దీవెన వసతి దీవెన జగనన్న గోరుముద్ద,పిల్లలకు యూనిఫార్మ్స్,స్కూల్ బ్యాగులు,షూస్,ఇలా ఎన్నో కార్యక్రమాలను విద్య కేటాయించారని తెలిపారు,గత ప్రభుత్వంలో చిరిగిన బట్టలతో సరైన వసతులు లేక పిల్లలు అస్తవ్యస్తలు పడే వారిని నేడు అలాంటి పరిస్థితి ఎక్కడా లేదని పక్క రాష్ట్రాలు సైతం నాడు నేడు ను ఆదర్శంగా తీసుకొని స్కూల్స్ను అభివృద్ధి చేసుకుంటున్నారని తెలిపారు, నేడు కోటి 32 లక్షల రూపాయలతో నిర్మించబోయే 11 అదనపు తరగతుల నిర్మాణానికి ఎటువంటి కాంట్రాక్టర్లు లేకుండా పూర్వపు విద్యార్థులు తమ స్కూల్ బాగు కోసం ఎటువంటి లాభాపేక్ష లేకుండా పూర్తి డబ్బును తరగతి గదులుకే వినియోగించేలా ఒక కమిటీ వేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర,వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్,రాష్ట్ర పూసల కార్పొరేషన్ డైరెక్టర్ చేని కుమారి,జడ్పిటిసి ఊట్ల నాగమణి, పట్టణ అధ్యక్షులు ఆకుల శ్రీకాంత్ బాజీ యువజన విభాగం అధ్యక్షులు ఆవాల భవాని ప్రసాద్ పట్టణ మహిళా అధ్యక్షురాలు ముసిని రాజ్యలక్ష్మి, కౌన్సిలర్ నూకల సాంబ,కోఆప్షన్ సభ్యులు ఖాదర్ బాబు,సర్పంచులు సూర్య ప్రకాష్,నరసింహారావు, పూర్వపు విద్యార్థులు,ప్రధానోపాధ్యాయురాలు మాధవిలత,తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img