Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్ పై స్పష్టమైన ప్రకటన చేయాలి:వామపక్ష నేతల డిమాండ్

విశాలాంధ్ర – పార్వతీపురం/బెలగాం : విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రధానమంత్రి మోడీ స్పష్టమైన ప్రకటనచేయాలని కోరుతూ స్థానిక రైతు బజార్ కూడలి సమీపంలో గల అంబేద్కర్ విగ్రహంవద్ద వామపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణకమిటీ నాయకులు యమ్మల మన్మధరావు ఆద్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమంను నిర్వహించారు.
ఈసందర్భంగా వామపక్ష, ప్రజాసంఘాల నాయకులుమాట్లాడుతూ నరేంద్రమోడీ, బిజెపి ఆంధ్రరాష్ట్రానికి తీవ్రమైన ద్రోహం చేశారన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను పోస్కో కంపెనీకి కారుచౌకగా కట్టపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని, లక్షమంది కార్మికులు, వేలాదిమంది ప్రజలు బ్రతుకుని, ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా కార్పోరేట్లకు స్టీల్ ప్లాంట్ ను ధారాదత్తం చేస్తున్నారని చెప్పారు. మోడీ పర్యటన సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను అమ్మడంలేదని ప్రకటన చేయాలని, వంద శాతం సామర్థ్యంతో నడపాలని, ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన హామీలు నెరవేరుస్తామని ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పార్వతీపురం మన్యం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.మన్మధ రావు,సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు, సిపిఐ ఎంఎల్ నాయకులు నర్సింగరావు, రైతు కూలి సంఘం నాయకులు భాషా, అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు రాజు, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పి. సంగం, ఇఫ్టూ నాయకులు సర్వేశ్వరరావు, సిఐటియు అధ్యక్షులు గొర్లి వెంకటరమణ, బివి రమణ, ఎస్ఎఫ్ఐ రాజశేఖర్. ఎఐఎస్ఎఫ్ నాయకులు బిటి నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కురుపాం మండలంలోని మొండెంఖల్లు గ్రామంలో మోడీ గో బ్యాక్ అంటూ కార్యక్రమాన్ని సీపీఐ జిల్లా సహాయకార్యదర్శి జీవన్,సూరయ్య, కె లింగరాజు ఆద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img