Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఐక్యమత్యంతో పోరాటాలు కొనసాగించాలి : ఏపీయూడబ్ల్యూజే

సంక్షేమ నిధికి 20వేలు విరాళం

విశాలాంధ్ర ఆస్పరి : జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యమత్యంతో పోరాటాలు కొనసాగించాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి సుంకన్న, జిల్లా ఉపాధ్యక్షులు స్వరూప్, చంద్ర మోహన్, జిల్లా సహాయ కార్యదర్శి శ్రీధర్ లు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏపీయూడబ్ల్యూజే మండల నూతన కమిటీని జిల్లా కార్యవర్గ సభ్యులు నాగన్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులు హక్కుల కోసం సమిష్టిగా పోరాడి సాధించుకోవాలన్నారు. అనంతరం మండలం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గౌరవ అధ్యక్షులుగా సాక్షి తిమ్మన్న, అధ్యక్షులుగా వార్త శ్రీనివాసులు, కార్యదర్శిగా ప్రజాశక్తి మురళి, ఉపాధ్యక్షులుగా ఆంధ్రప్రభ శ్రీనివాసులు, ఆంధ్రజ్యోతి శివకేసవ, కోశాధికారిగా మనం వెంకటేష్, ఆర్గనైజింగ్ కార్యదర్శి విశాలాంధ్ర నాగన్న, గౌరవ సలహాదారుడు ఈనాడు రూపమోహం, సహాయ కార్యదర్శులుగా లక్ష్మణ, రూబీమ్ తోపాటు మరికొందరిని కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల నూతన కమిటీ ఎన్నికలో ముఖ్య అతిథులుగా జిల్లా కెడిసిసి డైరెక్టర్ రాఘవేంద్ర, వైసీపీ మాజీ మండల కన్వీనర్ రామాంజనేయులు పాల్గొని నూతనంగా ఎన్నుకున్న మండల కమిటీ అధ్యక్ష,కార్యదర్శులకు పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు.

సంక్షేమ నిధికి 20వేలు సహాయం

మండల జర్నలిస్టుల సంక్షేమ అభివృద్ధికి మాజీ వైసీపీ మండల కన్వీనర్ రామాంజనేయులు 5 వేలు, జిల్లా కెడిసిసి డైరెక్టర్ రాఘవేంద్ర 5 వేలు, సొసైటీ చైర్మన్ గోవర్ధన 5 వేలు, వైసీపీ మండల కన్వీనర్ 5 వేలు ఆర్థిక సాయం అందించారు. అనంతరం జర్నలిస్టులు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

నూతన కార్యవర్గాన్ని సన్మానిస్తున్న నాయకులు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img