Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

రైతులకు సేంద్రీయ ఎరువులపై అవగాహన

విశాలాంధ్ర-తాడిపత్రి: పెద్ద పప్పూరు మండలంలోని దేవుని ఉప్పలపాడు గ్రామ పొలాలలో మంగళవారం ఉద్యావన శాఖ అధికారి ఉమాదేవి ఆధ్వర్యంలో చీనీ తోటలలో తోట బడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనీ తోటలలో సేంద్రీయ ఎరువులు, పశువుల ఎరువు, వాన పాముల ఎరువు, వేప, ఆముదం, కానుగ వేసుకోవాలన్నారు.పచ్చిరొట్ట, జీలుగ, జనుము, పిల్లపెసర్‌, ఉలువలు ఎకరాకు 6 నుండి 8 కిలోల వేసి 50 రోజుల తర్వాత దున్నాకోవాలన్నారు. జీవన ఎరువు అజటో, అజోస్కైలం ఫాస్పో బాక్టీరియా, అశ్వస్కూలర్‌, మైక్రోర్తి జారట్రైకోడెర్మా, సూర్మెనస్‌ వంటి జీవన ఎరువులు నేలలో వేసుకోవడం ద్వారా నేల ద్వారా సంక్రమించు ఎండు తెగులు, వేరుకుళ్ళు తెగులు దాదాపు అరికట్టవచ్చు.అదేవిధంగా వివిధ సూక్ష్మ పోషకాలు అను ఫార్ములా-4 ఒక లీటరు నీటికి 5 గ్రాములు, ఫార్ములా-4 కలిపి కొత్త చిగురు వచ్చకా స్ప్రే చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు ఆర్బికే అధికారి జి హరినాథ్‌ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img