Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవం

ముఖ్య, ఆత్మీయ అతిథులుగా ఏసీపీ మరియు సీఐ

విశాలాంధ్ర-మైలవరం: జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(APUWJ)మైలవరం శాఖ ఆధ్వర్యంలో మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు,రొట్టెలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ ఎం.రమేష్, ఆత్మీయ అతిథిగా సీఐ ఎల్.రమేష్, విశిష్ట అతిథిగా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏ.రామారావు పాల్గొన్నారు.ఆంద్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఉమ్మడి కృష్ణాజిల్లా అద్యక్షులు, ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ మరియు స్టేట్ కమిటీ సభ్యులు యు.వెంకట్రావు ఆధ్వర్యంలో పాత్రికేయ మిత్రులు ఏసీపీ రమేష్,సీఐ రమేష్,వైద్యులు రామారావు,భార్గవి చేతుల మీదుగా ఆసుపత్రిలోని రోగులకు పళ్ళు,రొట్టెలు పంపిణీ చేయించారు.అనంతరం సీనియర్ పాత్రికేయులు బట్టపర్తి రాజు,జబ్బార్ లకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.తదనంతరం జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏసీపీ రమేష్ మరియు సీఐ రమేష్,ఆసుపత్రి సూపరింటెండెంట్ రామారావు కేక్ కట్ చేసి జర్నలిస్టులకు పంపిణీ చేశారు.ఈ సంధర్భంగా ఏసీపీ రమేష్,సీఐ రమేష్ లు జర్నలిస్ట్ మిత్రులకు జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమంలో తమను భాగస్వాములను చేసినందుకు ఏపీయూడబ్ల్యూజే,మైలవరం శాఖ సభ్యులకు అభినందనలు తెలిపారు.మీడియా,పోలీస్ మద్య అవినాభావ సంబంధాలు మెరుగైన సమాజానికి దోహదం చేస్తాయని ఏసీపీ ఎం.రమేష్ అన్నారు.వార్తా సేకరణలో జర్నలిస్టుల కృషి అభినందనీయమని సీఐ ఎల్.రమేష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అద్యక్షులు, ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్,స్టేట్ కమిటీ సభ్యులు యు.వెంకట్రావు,ఉమ్మడి కృష్ణాజిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షులు చండీ నాగ ప్రసాద్,ఈసీ మెంబర్ పజ్జూరు నాగరాజు సీనియర్ పాత్రికేయులు మన్నే సాంబశివరావు,బట్టపర్తి రాజు,రాజా రెడ్డి,షేక్ జబ్బార్, శిష్ట్లా సూర్య ,వైడీపీ రెడ్డి,నరసయ్య, యూనియన్ సభ్యులు బాలాజీ ప్రసాద్,కోయ శివరామ కృష్ణ,కె.జయరాజు,శ్రీధర్ జర్నలిస్ట్ మిత్రులు మురళి,గోపి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img