Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

ఆవులనష్టపరిహారాన్ని రైతుకు అందజేసిన ఎమ్మెల్యే పుష్పాశ్రీవాణి

విశాలాంధ్ర పార్వతీపురం: కొమరాడ మండలంలోని దళాయిపేట గ్రామానికి చెందిన రైతు జి. వెంకటరమణకు 55వేల రూపాయల చెక్కును మాజీమంత్రి, కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పా శ్రీవాణి చేతులమీదుగా శుక్రవారంనాడు ఎమ్మెల్యే స్వగృహంలో ( చినమేరంగిలో) అందజేసారు. గతఏడాది డిసెంబర్, మార్చినెలలో రమణయ్యకు చెందిన రెండుఅవులు ఏనుగులదాడిలో మరణించిన సంగతితెలిసిందే. సదరు రైతుకు ఇంతవరకు నష్టపరిహారం అందలేదని గతనెల31న విశాలాంధ్రలో గజరాజులతో గండం – నష్టపరిహారం చెల్లించలేదని సదరురైతు ఆవేదనను ప్రచురణ చేయడంతోపాటు ఈనెల13న ఏనుగులదాడిలో రైతుమృతి – రైతులకు పరిహారం చెల్లింపులోజాప్యం పేరిట వార్తలను ప్రచురణ చేసింది. దీనికి అటవీశాఖ అధికారులు స్పందించి గురువారంనాడు మాజీ మంత్రి పుష్పాశ్రీవాణి చేతులమీదుగా మృతి చెందిన రైతు గోవింద్ కుటుంబ సభ్యులకు 2.5లక్షల రూపాయల చెక్కును అందజేశారు.శుక్రవారంనాడు గతంలో ఏనుగుల దాడిలో రెండుపశువులు మరణించగా రైతురమణయ్యకు శుక్రవారం 55లక్షల చెక్కును అందజేశారు. ఈకార్యక్రమంలో పార్వతీపురం ఫారెస్ట్ రేంజర్ త్రినాథరావు, సెక్షన్ ఆఫీసర్ గౌరీశంకరరావు, సహాయకుడు సాయి, దళాయిపేట గ్రామ సర్పంచ్ గొంగాడ రాము తదితరనాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img