Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

కనీస జీతభత్యాలు లేని వారు భవన నిర్మాణ కార్మికులే

ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి వహీదా నిజం

రాజమండ్రి – నవంబర్ 26: జాతీయ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏడవ మహాసభల సందర్భంగా కంబాల చెరువు గట్ట దగ్గర జరిగిన బహిరంగ సభకు జాతీయ అధ్యక్షులు విజన్ కొని సేరి అధ్యక్షులు వహించగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న కామ్రేడ్ వహీదానిజం మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారాం ప్రధానమంత్రి మోడీ జిడిపి రేటు పెరుగుతున్నదని ప్రగల్ బాలు పలుకుతున్నారని కానీ భవన నిర్మాణ కార్మికులు ఉత్పత్తి రంగంలో అభివృద్ధి సాధించకుండా కోటాను కోట్ల మంది అసంఘటిత కార్మికులు అభివృద్ధి లేకుండా డిజిపి ఎలా పెరుగుతుందని ప్రశ్నించారు. భవన నిర్మాణ కార్మికులు దేశంలో ఏడు కోట్ల మంది పైన నిత్యం పనిచేస్తున్నారని వీరికి సంక్షేమ కోసం 1996లో సంక్షేమ చట్టం వచ్చిందని ఆ చట్ట ప్రకారం నిర్మాణ బిల్డింగు వద్ద ఒక్క శాతం చెస్ వసూలు చేస్తే 80 వేల కోట్లు ప్రభుత్వం దగ్గర ఉన్నదని కానీ ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం గాలికి వదిలి నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.భవన నిర్మాణ కార్మికులు వారి సంక్షేమం కోసం చట్టాలు అమలు కోసం వారి జీవిత బాత్యాల పునరుద్ధరణ కోసం కటిక దరిద్రం నుంచి, పేదరికం నుంచి బయటపడాలని పోరాటాలు తప్పక నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేసు మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ అమృత్సవాలు జరుపుకోవాలని చెబుతున్నారని భవన నిర్మాణ కార్మికుల వారికి సౌకర్యాలు కలిగించకుండా వారి హక్కులు కాపాడకుండా ఎలాంటి అమృత ఉత్సవాలు జరుపుకోవాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త ఇసుక పాలసీ పెట్టి కార్మికులకు పనులు లేకుండా చేశారని రాష్ట్రంలో సంక్షేమ బోర్డు నిర్వీర్యం చేసి 32వేల క్లైములు పెండింగ్ పెట్టాడని ఇలాంటి సమస్యల పైన మహాసభలో తీర్మానాలు చేసి బలమైన ఉద్యమాలు నిర్మించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి కే రవి ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి టి మధు ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి సోమ సుందర్ ఏ ఐ టి సి రాష్ట్ర కార్యదర్శి బివివి కొండలరావు భవన నిర్మాణ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి నాయకులు ఎస్ వెంకటసుబ్బయ్య,పడాల రమణ,సత్యనారాయణ తెలంగాణ రాష్ట్ర నాయకులు ఉజ్జయిని రత్నాకర్ రావు ఏం. ప్రవీణ్ కుమార్ రాజమండ్రి జట్లు సంఘం నాయకులు K.రాంబాబు
సిపిఐ నగర కార్యదర్శి వి. కొండలరావు. జట్లు సంఘం ప్రధాన కార్యదర్శి సప్ప రమణ ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు చంద్రనాయక్ వాడిని విప్లవ గేయాలు ఆకట్టుకున్నావి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img