Monday, May 6, 2024
Monday, May 6, 2024

బోగస్ ఓట్లపై చర్యలు తీసుకోండి

కళ్యాణదుర్గం ఆర్డీవోకు సిపిఐ వినతి

విశాలాంద్ర – కళ్యాణదుర్గం : పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో సరైన ఆధారాలు చెప్పకుండా ఓటు హక్కు పొందిన వారిని గుర్తించి తక్షణం జాబితా నుంచి తొలగించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు మంగళవారం కళ్యాణదుర్గం ఆర్డీవోకు ఈ మేరకు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్, రైతు సంఘం తాలూకా కార్యదర్శి నరసింహులు, పట్టణ కార్యదర్శి ఓంకార్ ,సహాయ కార్యదర్శి బుడెన్ లు వినతి పత్రం అందించారు . పిఎస్ నెంబర్ 81 లో 209 ఓట్లు నమోదైతే అందులో 57 మంది ఓటర్ల వివరాలపై అనుమానాలు ఉన్నాయని వాటి పైన పూర్తిస్థాయిలో విచారణ జరపాలన్నారు.
ప్రభుత్వానికి ఉపాధ్యాయులు మద్దతు లేదని నకిలీ ఓటర్లతో ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నదన్నారు . బోగస్ ఓట్లను నమోదు చేసేందుకే డీఈఓ శామ్యూల్ ను రాత్రికి రాత్రి బదిలీ చేశారన్నారు. వందల మంది ప్రభుత్వ ఉపాధ్యాయుల ఓటర్లను రిజెక్ట్ చేయడం వెనుక ప్రభుత్వ హస్తం ఉందన్నారు . విచారణ జరిపి నకిలీ ఓటర్లను తొలగించాలని లేనిపక్షంలో పోరాటం కొనసాగిస్తామన్నారు. ఫిర్యాదు చేసిన ఓట్లలో ఓటర్లలో అప్లోడ్ చేసిన అప్లికేషన్లు అసంపూర్ణంగా ఉన్నాయని ఫారం 19 పొందుపరిచిన వివరాలు ఒకదానికొకటి భిన్నంగా ఉన్నాయని మూడు సంవత్సరాల ఈపీఎఫ్ సబ్స్క్రిప్షన్ వివరాలు అందించలేదని దరఖాస్తుదారులు సేవ ప్రమాణ పత్రాన్ని సమర్పించకపోవడం ఒకటికంటే ఎక్కువ చోట్ల ఓటర్ గా నమోదు కావడం గ్రాడ్యుయేట్ నియోజకవర్గం లో దరఖాస్తు చేస్తే ఉపాధ్యాయ నియోజకవర్గంలో ప్రతిబింబించడం దరఖాస్తుదారు సర్వీస్ సర్టిఫికెట్స్ పైన నకలి సంతకాలు చేయడం మొదలగు 14 కారణాలను చూపుతూ 57 ఓటర్ల పైన విచారణ జరపాలని సిపిఐ నాయకులు కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img