Monday, May 6, 2024
Monday, May 6, 2024

అహ్మదాబాద్‌లో ఓటు వేసిన ప్రధాని..

దేశ ప్రజలకు అభినందనలు అంటూ ట్వీట్‌
దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సైతం ఓటు

గుజరాత్‌ రెండో దశ ఎన్నికల పోలింగ్‌ నేడు సజావుగా సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తున్నందుకు ఎన్నికల కమిషన్‌ ను ప్రధాని అభినందించారు. ‘‘ప్రజాస్వామ్యం పండుగను గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, దిల్లీ ప్రజలు గొప్పగా జరుపుకుంటున్నారు. దేశ ప్రజలకు నా అభినందనలు. అలాగే, ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తున్నందుకు ఎన్నికల సంఘానికి కూడా నా అభినందనలు’’ అని ప్రధాని ట్విట్టర్‌ లో పేర్కొన్నారు.ఢల్లీి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా, ఆయన భార్యతో కలసి అహ్మదాబాద్‌ లో ఓటు వేశారు. విరంఘమ్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన హార్థిక్‌ పటేల్‌ సైతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక కేంద్రహోంమంత్రి అమిత్‌ షా అహ్మదాబాద్‌ లో ఓటు వేయనున్నారు. ఉదయం 9 గంటల వరకు 4.6 శాతం ఓటింగ్‌ నమోదైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img