Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

విపత్తుల నివారణకు తక్షణ స్పందన అవసరం: డి ఆర్ ఓ వెంకట రావు

విశాలాంధ్ర,పార్వతీపురం : విపత్తుల నివారణకు తక్షణ స్పందన అవసరమని జిల్లా రెవిన్యూ అధికారి జె. వెంకటరావు తెలిపారు.విపత్తుల నిర్వహణ, నివారణపై జాతీయ విపత్తుల యాజమాన్య సంస్థ సౌజన్యంతో రాష్ట్ర విపత్తుల యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలోఆపదమిత్రలకు 12రోజుల శిక్షణాకార్యక్రమంను గురువారం సెయింట్ పాల్ లూథరన్ చర్చివద్ద జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విపత్తులనిర్వహణ, నివారణపై ఆపద మిత్రశిక్షణ పొందడం శుభసూచకమన్నారు. శిక్షణా కార్యక్రమాన్ని ఆసక్తితో స్వీకరించాలని, తద్వారా సమాజానికే కాకుండా సొంతానికి కూడా ఉపయోగపడుతుందని వివరించారు. తుఫానులు, వరదలు, భూకంపాలు, వడ దెబ్బ తదితర అంశాలు విపత్తుల క్రింద వస్తాయని ఆయా సమయాల్లో ఏవిధంగా స్పందించాలనే అంశంపై శిక్షణా కార్యక్రమం ఉపయోగ పడుతుందనిచెప్పారు. విపత్తుల నిర్వహణ, నివారణలో పాల్గొనడం గొప్ప అదృష్టంగా భావించాలన్నారు.ఆపద మిత్రలు తమప్రాంతంలో విపత్తులు సంభవించే సమయంలో చురుకుగా వ్యవహరించి ఆస్తి, ప్రాణ నష్టాల నివారణలో అంకిత భావంతో పనిచేయాలనికోరారు. పార్వతీపురం మన్యం జిల్లా విపత్తుల నిర్వహణలో ఆదర్శంగా నిలవడానికి ఆపద మిత్రలు ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు.
జిల్లాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి డా.ఎం. అశోక్ కుమార్ మాట్లాడుతూ విపత్తులు సంభవించినపుడు ప్రాణ, ఆస్తినష్టాలను, ఆరోగ్య సమస్యలు, ఉపాధి కోల్పోవడం వంటి సమస్యలను సమాజం ఎదుర్కుంటుందని అన్నారు. విపత్తులలో కలిగే నష్టాలు, బాధల నుండి నివారణకు, అండగా ఉండుటకు ఆపదమిత్రలను ఎంపిక చేసి శిక్షణ కల్పించడం జరుగుతుందన్నారు. గ్రామ వాలంటీర్లు, ఆశాలు, హోం గార్డులు, నెహ్రూ యువ కేంద్రం వాలంటీర్లు తదితర వర్గాల నుంచి ఆపద మిత్రలను ఎంపిక చేయడం జరిగిందని ఆయన చెప్పారు.
శిక్షణాకార్యక్రమం 12 రోజులపాటు సాగుతుందన్నారు. వివిధఅంశాలపై నిపుణులైన వారితో శిక్షణ ఉంటుందని ఆయన తెలిపారు.జిల్లాగ్రామ పంచాయితీ అధికారి బలివాడ సత్యనారాయణ మాట్లాడుతూ విపత్తులకు ముందు, విపత్తుల సమయంలో, విపత్తుల అనంతరం తీసుకోవలసిన చర్యలపై చక్కని అవగాహన, ప్రణాళిక ఉండాలని అన్నారు.జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టరు తెర్లి జగన్మోహనరావు మాట్లాడుతూ తక్కువసమయంలో స్పందించడంవలన ప్రాణాలు కాపాడగలమన్నారు. జిల్లామత్స్య శాఖ అధికారి వేముల తిరుపతయ్య మాట్లాడుతూ ఆపద మిత్ర సామాజిక బాధ్యత కలిగిన అంశం అన్నారు.
ఈకార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి లోచర్ల రమేష్, మండలపరిషత్ అభివృద్ధి అధికారి జావేద్, జిల్లా శిక్షణా మేనేజర్ ఏ.దేముడు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img