Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరిస్తే సహించేది లేదు..

సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ.ఎస్. వెంకటేష్

విశాలాంధ్ర ..ధర్మవరం : కేంద్రంలో మోడీ ప్రభుత్వం చరిత్రలో ఏనాడు లేనివిధంగా కార్మికుల, ఉద్యోగుల హక్కులపై దాడి చేస్తుందని, ప్రభుత్వ రంగాన్ని మొత్తంగా ప్రైవేటుకరించడం, ప్రభుత్వ ఆస్తులన్నింటినీ మానిటైజేషన్ పేరుతో వ్యాపార సంస్థల పరం చేయడం లక్ష్యంగా మోడీ ఆర్థిక విధానాలు అమలవుతున్నాయని శ్రీ సత్య సాయి జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి ఈ.ఎస్. వెంకటేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో వారు విలేకరులతో మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లను ఏకపక్షంగా అమలు చేస్తూ, కార్మిక హక్కులపై మోడీ ప్రభుత్వం తీవ్రంగా దాడి చేస్తుందని, సంఘ స్వేచ్ఛ, సమీష్టి బేర సారాల హక్కు, సమ్మె హక్కులను బలహీనపరిచి, కార్మికులను ఆధునిక బానిసలుగా మార్చాలన్నదే నేటి బిజెపి ప్రభుత్వ లక్ష్యమన్నారు. అలాగే వైసిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే స్కీం వర్కర్లు, చిరుద్యోగులపై కక్షగట్టి ఉద్యోగాల నుండి తొలగించి ఆ స్థానాలలో తమ కు అనుకూలమైన వారిని పెట్టుకోవడం జరుగుతోందని తెలిపారు. మధ్యాహ్న భోజన వ్యవస్థ కార్మికులను రాజకీయ కారణాలతో తొలగించడం దారుణమని తెలిపారు. విద్యుత్తు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించి ఆ స్థానాలలో ఐదు నుండి 10 లక్షల వరకు అమ్ముకోవడం జరుగుతుందని తెలిపారు. కార్మిక, కర్షక, ఉద్యోగుల సమస్యల్లో సిఐటియు నిరంతర పోరాటం చేస్తుందని, ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, నిరంతరం అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర చేనేత అధ్యక్షులు పోలా రామాంజనేయులు, సిఐటియు మండల కార్యదర్శి ఆయుబ్ ఖాన్, సిఐటియు అధ్యక్ష, కార్యదర్శులు ఆదినారాయణ, ఆయుబ్బ్ ఖాన్, రవాణా రంగం రాష్ట్ర నాయకులు రఫీ, పట్టణ రాష్ట్ర నాయకులు తొండమల బాబు, జబీబుల్ల, షేక్ రఫీ, రామాంజి ,రవి, మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బాబు, చెన్నకేశవులు, పుల్లన్న, మీటర్ రీడర్స్ నాయకులు దస్తగిరి తో పాటు అంగన్వాడి కార్యకర్తలు, నాయకులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img