Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

అంటిపేటలో గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమం నిర్వహణ

విశాలాంధ్ర, సీతానగరం:మండలంలోని అంటిపేట సచివాలయంపరిధిలోని అంటిపేట గ్రామంలో గురువారం గడప-గడపకు మనప్రభుత్వ కార్యక్రమం ఎమ్మెల్యే జోగారావు ఆద్వర్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్విరామంగా నిర్వహించారు.
అంటిపేటలో ఎమ్మెల్యేకు స్థానిక సర్పంచ్ సిరికి మహేష్, ఎంపిటిసి శనపతి నిర్మల, శనపతి తిరుపతిరావు, ఉపసర్పంచ్ వాకాడ తిరుపతిరావు, మాజీ జడ్పీటీసీ అంబటి కృష్ణంనాయుడు, దానబాబుల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, నాయకులు,సచివాలయంఉద్యోగులు, వాలంటీర్లు ఘనస్వాగతం పలికారు.అందరితోకలిసి ఎమ్మెల్యే గ్రామంలో ప్రతీగడపకువెళ్లి ప్రజలను కలుసుకుని యోగ క్షేమాలు తెలుసుకొని ప్రభుత్వం వారికి అందచేసిన సహాయాన్ని వివరిస్తూ ప్రతీఒక్కరూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం గా గెలిపించాలని, ఆయనతోపాటు తనకు ఆశీర్వాదంలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ధాన్యం కొనుగోలులో ఎటువంటి ఇబ్బందులూ లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో ఆయనతోపాటు ఎంపీపీ రవనమ్మ, జడ్పీటీసీ మామిడి బాబ్జీ, మండలపార్టీ అధ్యక్షులు బొంగు చిట్టిరాజు, బలగ శ్రీరాములు నాయుడు, మండల వైసీపీ సీనియర్ నాయకులు పోల ఈశ్వర నారాయణ, టి వెంకటఅప్పలనాయుడు, ఆర్వీ పార్థసారథి,ఎన్ రామకృష్ణ,రత్నాకర్, ఎంపీటీసీలు ఎస్ కిరణ్ కుమార్, రమణ,బుజ్జి, సర్పంచులు ధనుంజయనాయుడు,అన్నంనాయుడు, అల్లుతిరుపతినాయుడు, అధికారి నారాయణరావు, బలగ శ్రీనివాసరావు, గొట్టాపుఅప్పారావు, తెంటు రామారావు, బి తిరుపతిరావు, రాధాకృష్ణ, బి శ్రీహరి, యాళ్ళ వెంకటనాయుడు, బొంగు భాస్కరరావు, పి తిరుపతిరావు, శ్రీనివాసరావు, చింతాడ కృష్ణ, ఉమామహేశ్వరరావు, వైసీపీ నాయకులు సింహాచలం,నాగరత్నం, బి సత్యన్నారాయణ, శివున్నాయుడు, రాధాకృష్ణ, జగన్నాధం, బలరాం, సురేష్, నాయుడు, మండలఅధికారులు, సెక్రటరీ శశిభూషణరావు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, కార్యకర్తలు, గ్రామప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img