Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

సత్వరమే స్పందించండి..లేదంటే ఆందోళన తప్పదు

పబ్లిక్‌ హెల్త్‌ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌
వైద్య ఆరోగ్య ఉద్యోగుల సమస్యలు హెల్త్‌ డైరెక్టర్‌ దృష్టికి

విశాలాంధ్ర- అనంతపురం వైద్యం : ఐ.ఎన్‌.టి.యు.సి అనుబంధ ఆంధ్రప్రదేశ్‌ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం ఇటీవల విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన వైద్య ఆరోగ్య ఉద్యోగుల రాష్ట్ర మహాసభ తీర్మానాలను ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షులు ఆస్కార్‌ రావు ప్రధాన కార్యదర్శి బాబాసాహెబ్‌ లు హెల్త్‌ డైరెక్టర్‌ ను కలసి అందచేశారు.వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తమ సమస్యల సాధనకు ఆత్మగౌరవ సభగా జరుపుకున్న మహాసభ తీర్మానించిన సుమారు 26 తీర్మానాల ప్రతిని అందజేసి, ఒక్కొక సమస్య విషయాన్ని సమగ్రంగా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న రెగ్యులర్‌, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను క్లుప్తంగా వివరించి పరిష్కారం కోసం వెంటనే జాయింట్‌ మీటింగ్‌ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఎన్నిక జరిగిన కార్యవర్గం ప్రతిని అందచేసి సమస్యల పరిష్కారానికి కింది స్థాయి అధికారులకు కూడా ఆదేశం ఇవ్వాలని కోరారు. వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సమస్యలను డైరెక్టర్‌ స్థాయిలో సానుకూల దృక్పథంతో పరిష్కరించాలని, ప్రభుత్వ నిర్ణయం అవసరమైన చోట ఆమేర ప్రతిపాదన పంపాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆస్కార్‌ రావు, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబా సాహెబ్‌, రాష్ట్ర నాయకులు సత్యనారాయణ బాబు, ప్రకాశం జిల్లా అధ్యక్షులు శేషుబాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img