Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

పర్యావరణాన్ని పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

విశాలాంధ్ర-రాప్తాడు..పర్యావరణాన్ని పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని జెడ్పీటీసీ పసుపుల హేమావతి, సర్పంచ్ ప్రభావతి తెలిపారు. హంపాపురం సమీపంలోని ఎస్వీఐటి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపు లో భాగంగా సోమవారం మండలంలోని మరూరు గ్రామంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. భవిష్యత్తులో పర్యావరణ దుష్పరిమాణాలను నివారించేందుకు మొక్కలు నాటడమే మార్గమన్నారు.  పర్యావరణంలో సమతుల్యత లోపించడం వల్ల వాతావరణంలో అనేక మార్పులు సంభవించాయని, తద్వారా ప్రతి ఏడాదీ ఉష్ణోగ్రతల్లో రెండు డిగ్రీల పెరుగుతూ వస్తోందన్నారు. ఇంటి ఆవరణ, తోటల్లో విరివిగా మొక్కలు నాటి సంరక్షించడం వల్ల వర్షాలు కురుస్తా యన్నారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ వీ.బీ.ఆర్.శర్మ,  ,చైర్మన్ బీ.వీ.క్రిష్ణారెడ్డి, వైస్ చైర్మన్ వెన్నెపూస రవీంద్రరెడ్డి, సీ.ఈ.ఓ ఆనందకుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ టి.సూర్యశేఖరరెడ్డి,  ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఎం. శ్రీనివాసులు నాయక్, పిడి రమేష్, నారాయణస్వామి, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img