Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

శనగ పంటలో బూడిద తెగుళ్లు.. ఆందోళన వద్దు…

ఆలూరు ఏడిఏ సునీత

విశాలాంధ్ర ఆస్పరి : పప్పు శనగ పంటలో బూడిద తెగుళ్లు వ్యాపించడం వలన రైతులు ఆందోళన చెందవద్దని పంటల సాగులో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ఆలూరు ఏడీఏ సునీత తెలిపారు. మంగళవారం ఆస్పరి గ్రామ రైతుల పప్పు శనగ పంట పొలాలను ఆలూరు వ్యవసాయ శాఖ ఏడిఏ సునీత, మండల వ్యవసాయ అధికారి మునెమ్మ లు పరిశీలించారు. ఈ సందర్భంగా శనగ పంట రైతులతో మాట్లాడుతూ శనగ పంటలో బూజు తెగుళ్లు నివారణకు కార్బెండజిమ్ 1 గ్రాం/లీటరుకు పిచికారి చేయవలసిందిగా రైతులకు సూచించారు. వ్యవసాయ అధికార సలహాలు సూచనలు పాటించి, మంచి దిగుబడులు సాధించాలన్నారు. అనంతరం స్థానిక కోరమండల్, ఎరువులు దుకాణాలను తనిఖీ చేపట్టారు. ఎరువుల దుకాణాల యజమానులు సక్రమంగా వ్యాపారం చేసుకోవాలనీ, రైతులను మోసం చేయడం, అధిక రేటు సరుకులను అమ్మడం చేయకూడదనీ, అలా చేస్తే చర్యలకు తీసుకుంటామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విఏఏ, అనిల్ కుమార్ విహెచ్ ఏ, జ్యోతిర్మయి, వాలంటరీలు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img