Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

తెలుగు భాషకు ఖండాంతర ఖ్యాతిని ఆర్జించి పెట్టిన కవి వేమన

విశాలాంధ్ర ధర్మవరం:: తెలుగు భాషకు ఖండాంతర ఖ్యాతిని ఆర్జించి పెట్టిన సుప్రసిద్ధ కవి యోగి వేమన అని ప్రధానోపాధ్యాయులు ఆనంద భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని పోతుల నాగేపల్లి ప్రభుత్వ పాఠశాలలో యోగివేమన జయంతి వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యాయులు జరుపుకున్నారు. తొలుత వేమన చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆనంద భాస్కర్ రెడ్డి వేమన జీవిత విశేషాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థిని లక్ష్మి ప్రియ పాడిన వేమన పద్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం ఆనంద భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ వేమన్నవాదం.. ఆధునిక వేదమని, వారు రచించిన పద్యాలు స్ఫూర్తిని ఇస్తున్నాయని తెలిపారు. వేమన జాతికి నూత్న వ్యక్తిత్వాన్ని ప్రసాదించిన సాధకుడు, బోధకుడు, యోగి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అరవిందు, చలపతి, జయప్రద, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img